Sonu Sood: ‘రియల్ హీరోలు ప్రజలే’

Share

Sonu Sood: తాను రియల్ హీరోను కాదనీ, రియల్ హీరోలు ప్రజలేనని బాలీవుడ్ హీరో సోనూ సూద్ అన్నారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోనూ సూద్ గురువారం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. సోనూ సూద్ కి విమానాశ్రయంలో పలువురు బీజేపీ నేతలు, అభిమానులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన  సోనూ సూద్ తనను అందరూ రియల్ హీరోగా సంభోదిస్తుండంపై పై వ్యాఖ్యలు చేశారు.

Sonu Sood visit vijayawada
Sonu Sood visit vijayawada

విజయవాడ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజా సేవ కొనసాగిస్తూనే ఉంటాననీ, ప్రజలు చూపిస్తున్న అభిమానం ఎన్నటికీ మరువనని సోనూ సూద్ పేర్కొన్నారు. అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో సోనూ సూద్ పాల్గొన్నారు. తరువాత దుర్గమ్మ దర్శనానికి ఇంద్రకీలాద్రి బయలుదేరి వెళ్లారు. తోపులాట జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

సోనూ సూద్ నిన్ననే విజయవాడ దుర్గమ్మ దర్శించుకోవాల్సి ఉండగా షెడ్యూల్ లో మార్పు జరిగింది. నిన్న హైదరాబాద్ కు సోనూ సూద్ చేరుకున్నారు.


Share

Related posts

Payal Rajput Joshful Lucks

Gallery Desk

‘పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు’

somaraju sharma

దేశంలో కోవిడ్ వికృతరూపం.. 9లక్షలు దాటిన కేసులు

Muraliak