NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

మిలాట్ మీరు రాజ్యాంగ అతితులా!! దైవాంశ సంభూతుల?

న్యాయవ్యవస్థను.. న్యాయమూర్తులను.. న్యాయవాదులను ప్రశ్నించకూడదా?? వారు ఏమైనా దైవతితుల?? రాజ్యాంగం వర్తించని వార?? హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ తన ఉద్యోగ కాలం బడుగు అయిపోతున్న సమయంలో కొత్త వివాదాలకు కొత్త వ్యాఖ్యలకు తెరవడం ఇప్పుడు పెద్ద చర్చకు తెర తీస్తోంది. న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి లోబడిన వ్యవస్థ. న్యాయవ్యవస్థకు ప్రత్యేకమైన రాజ్యాంగం ఏది లేదు. రాజ్యాంగం లోనూ న్యాయవ్యవస్థకు ఎలాంటి తప్పులు చేసినా న్యాయమూర్తులు ఎలాంటి పక్కదారి పట్టిన ఉరికే వదిలేయాలని ఎక్కడా లేదు. సాధారణ ప్రజానీకానికి అమలయ్యే చట్టాలు శిక్షలు సైతం న్యాయమూర్తులు ఎదుర్కొంటారు… దాన్ని రాకేష్ కుమార్ పాపం మర్చిపోయినట్టున్నారు.. న్యాయ వ్యవస్థ అంటే రాజ్యాంగ వ్యవస్థకు అతీతంగా పని చేస్తుందని దాని కంటే పైన ఉందని ఆయన భావిస్తున్నట్లు అన్నారు. దీంతోనే ఆయన రకరకాల వ్యాఖ్యానాలు విచిత్రమైన మాటలకు ఇప్పుడు ఆజ్యం పోసి ఆనంద పడుతున్నట్టు ఉన్నారు.

special permisiion for courts
special permisiion for courts

** కోర్టులకు ప్రత్యేకమైన అధికారాలు, ప్రత్యేకమైన చట్టాలు ప్రత్యేకమైన రాజ్యాంగం ఏది భారతదేశంలో లేదు. రాజ్యాంగాన్ని అనుసరించి వ్యవహరించాల్సిన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ ముందు వరుసలో ఉంటాయి. అలాగే పాలనా వ్యవస్థను కలుపుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యవస్థగా వీటిని పేర్కొంటారు. న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే రాజ్యాంగంలోని మౌలిక విషయాలను… రాజ్యాంగ సూత్రాలను ఎవరైనా సరే దాటితే న్యాయవ్యవస్థ దానిని పరిరక్షించాలి. న్యాయవ్యవస్థ పరిరక్షించడానికి ఎలాంటి దారులున్నాయి ఎలాంటి పరిమితులు ఉన్నాయి అనే విషయాలను సైతం చట్టం, రాజ్యాంగం నిర్వచిస్తున్నాయి. దానిలో పేర్కొన్న విధంగానే న్యాయ వ్యవస్థ సైతం స్పందించాలి. జంగా పరిరక్షణకు రాజ్యాంగంలో ఉన్నట్లే నడుచుకోవాలి. అది వ్యవస్థ అది మన రాజ్యాంగం గొప్పదనం.
** రాజ్యాంగాన్ని కాపాడడానికి పౌరులందరికీ హక్కులను బాధ్యతలను వారి విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు న్యాయ వ్యవస్థలు తోడ్పడాలని క్రమంలో న్యాయవ్యవస్థకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు తప్పితే న్యాయవ్యవస్థకు న్యాయస్థానాలకు న్యాయమూర్తులకు ప్రత్యేకమైన అధికారాలు ఏమీ ఉండవు. దీనిని గౌరవ జస్టిస్ రాకేష్ కుమార్ గుర్తిస్తే బాగుంటుంది.


** స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2020 జనవరి వరకు సుమారు 180 మంది వివిధ కోర్టుల కు చెందిన న్యాయమూర్తులు వివిధ నేరల్లో.. ఆరోపణలు ఎదుర్కొని, తాము పని చేసిన న్యాయస్థానాల్లో నే విచారణ ఎదుర్కొని వివిధ శిక్షలు ఎదుర్కొన్నారు. దీనిని జస్టిస్ తెలుసుకుంటే బావుంటుంది.
** ఒక కేసు విచారణ నుంచి సదరు న్యాయమూర్తిని తప్పించాలని కోరే అధికారం పిటిషనర్ల కు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. దీని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసి, పెళ్లి కేసుల నుంచి జస్టిస్ రాకేష్ కుమార్ ను తప్పించాలని కోరుతోంది. దీనిలో ఎక్కడా తప్పు లేదు. న్యాయవ్యవస్థ ఆధీనంలోనే ప్రభుత్వం నడుచ్చుకుంది. తనను విచారణ నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్పై వాదనలను విన్న న్యాయమూర్తి చేయడం పెద్ద విచిత్రం. అంటే తనకు ఇష్టం లేని విషయాన్ని అదే న్యాయమూర్తి ఇప్పుడు ఒప్పుకోవాలి అన్నమాట. ఇప్పుడు హైకోర్టు లో జరుగుతున్న మొత్తం విషయం వెనుక రాకేష్ కుమార్ ఈ కేసులు తప్పుకోవడం పై స్పష్టత ఇవ్వకుండా విచిత్రమైన అసందర్భమైన వ్యాఖ్యలు చేయడం విశేషం.
** తాను ఉద్యోగ విరమణ చివరి దశలో రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న అని చెబుతున్న రాకేష్ కుమార్ కేసుల విచారణ నుంచి తప్పుకొని ఉంటే ఎంతో బాగుండేది. అలా కాకుండా తన పదవి విరమణ చేసే వరకు వాయిదాల మీద వాయిదాలు వేయడం ద్వారా రాకేష్ కుమార్ కొత్త సంకేతాలు ఇచ్చినట్లు అయింది. ప్రభుత్వం చెబుతున్న ఆరోపిస్తున్న అంశాలకు రాకేష్ కుమార్ వివిధ రకాల వ్యాఖ్యల ద్వారా సైతం దానికి మరింత బలం చేకూరుస్తున్నారు. ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నాను అని అనుకుంటూనే అది పట్టు తప్పుతుందని గుర్తించడం లేదు.

author avatar
Comrade CHE

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!