Sri Satya Sai Dist: ఘోర ప్రమాదంపై దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్ .. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

Share

Sri Satya Sai Dist: శ్రీసత్యసాయి జిల్లాలో ఈ ఉదయం జరిగిన ఘోర ప్రమాదంలో అయిదుగురు వ్యవసాయ కూలీలు సజీవ దహనం కాగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పారిస్ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వెంటనే స్పందించారు. సీఎంఒ ద్వారా ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేసిన సీఎం వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.

Sri Satya Sai Dist Accident CM YS Jagan announces ex gratia

 

తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి వద్ద ఈ ఉదయం ఆటో పై విద్యుత్ వైర్లు తెగి పడటంతో అయిదుగురు మహిళా వ్యవసాయ కూలీలు సజీవ దహనం అవ్వగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ధర్మవరం ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో గుడ్డంపల్లికి చెందిన కాంతమ్మ, రత్నమ్మ, లక్ష్మీదేవి, పెద్దకోటకు చెందిన కుమారి ఉన్నారు. కాగా ప్రమాద ఘటనపై ఏపిఎస్‌పిడీసిఎల్ సీఎండి హరినాథరావు స్పందిస్తూ..మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.2లక్షల వంతున ఆర్దిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ప్రమాద ఘటనలో వెలుగు చూసిన దాని ప్రకారం ఒక ఉడత కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కరెంటు వైర్ ను ఎర్త్ వైర్ ను ఉడత క్రాస్ చేయడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద ఘటనపై శాఖపరమైన విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. అనంతపురం ఎస్ఇతో పూర్తి విచారణకు ఆదేశించామని తెలిపారు.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

7 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

9 గంటలు ago