ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపీ మంత్రి రోజా నివాసంలో స్టార్ షట్టర్ పీవీ సింధు కుటుంబం సందడి

Share

ఇటీవల జరిగిన కామన్వెల్డ్ క్రీడల్లో మహిళల బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత స్టార్ షట్టర్ పీవీ సింధు కుటుంబం శనివారం ఏపి మంత్రి ఆర్కే రోజా నివాసంలో సందడి చేసింది. తల్లిదండ్రులు, సోదరితో కలిసి పీవీ సింధు ఈ రోజు మంత్రి రోజా నివాసానికి వెళ్లారు. సింధు కుటుంబానికి మంత్రి రోజా మధ్యాహ్నం విందు ఏర్పాటు చేశారు. రోజా కుటుంబ సభ్యులతో సింధు కుటుంబ సభ్యులు భోజనం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలను మంత్రి రోజా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టు చేశారు.

 

బంగారు పతకం సాధించిన మన ‘బంగారం’ సింధు తన కుటుంబంతో వచ్చి తనను కలవడం చాలా అనందంగా ఉందని పేర్కొన్నారు మంత్రి రోజా. సింధు కుటుంబంతో కలిసి తమ కుటుంబం లంచ్ చేయడం జరిగిందన్నారు. కాగా భారత హాకీ జట్టులో సభ్యురాలైన ఏపి క్రీడాకారిణి రజని కూడా శనివారం మంత్రి రోజాను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగారజినిని కూడా రోజా ఘనంగా సత్కరించారు. పీవీ సింధు కుటుంబంతో పాటు రజిని కూడా రోజా నివాసంలోనే భోజనం చేశారు.

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం .. వామపక్షాల మద్దతు కూడగట్టిన టీఆర్ఎస్..?


Share

Related posts

Vikram : ‘విక్రమ్’ లో నలుగురు విలన్లను ఢీకొనబోతున్న కమల్ హాసన్

GRK

వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష

Special Bureau

Breaking News: ఎస్‌ఈసీగా నీలం సాహ్ని  నియామకంపై వేసిన పిటిషన్‌ ఉపసంహరణ..!!

P Sekhar