NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide: నిందితుడు ఆత్మహత్య..! ఎస్ఐ, కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు..! విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

Suicide: అక్రమ మద్యం రవాణా కేసులోని ఓ నిందితుడు ఆత్మహత్య వ్యవహారం ఓ కానిస్టేబుల్, ఎస్ఐ మెడకు చుట్టుకుంది. నిందితుడు ఆత్మహత్య చేసుకుంటే ఎస్ఐ, కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ ఎందుకు చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. రాష్ట్రంలోని ఏ శాఖలోనూ అవినీతిని ఉపేక్షించేది లేదని ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నా వివిధ శాఖల్లో అవినీతి కొనసాగుతూనే ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

Suicide Case: si and constable suspended
Suicide Case si and constable suspended

Read More: Modi Govt: తూచ్..ఆ కమిటీనే లేదు..!!

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన పిచ్చుక మజ్జి గత ఏడాది అక్రమ రవాణా చేస్తున్నాడనే కారణంతో కృష్ణాజిల్లా చిల్లకల్లు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే అరెస్టు పెండింగ్ లో ఉందని 41 నోటీసు అందజేసి అతనిని చిల్లకల్లు పోలీసు స్టేషన్ కు పిలిచించారు. అయితే ఈ కేసులో సహజంగా స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. కానీ చిల్లకల్లు పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్ అతని వద్ద నుండి లక్ష రూపాయలు డిమాండ్ చేశాడనీ, డబ్బులు ఇస్తే అతనిపై ఉన్న కేసులు మాఫీ చేస్తామని లేకుంటే గంజాయి అక్రమ రవాణా కేసులు బనాయిస్తామని బెదిరించాడని ఆరోపిస్తూ పిచ్చుక మజ్జి  సెల్ఫీ వీడియో తీసి ఇంటి వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని సెల్ఫీ వీడియో బయటకు రావడంతో యువకుడి మరణానికి కారణమైన కానిస్టేబుల్ శివరామకృష్ణ ప్రసాద్, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ దుర్గా ప్రసాద్ లపై జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ సస్పెన్షన్ వేటు వేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి వారిని విధుల నుండి తొలగించడానికి సైతం వెనుకాడమని ఎస్పీ హెచ్చరించారు. అయితే ఇటువంటి వ్యవహారాల్లో నిందితులు చెప్పే విషయాల్లో కొంత వరకు వాస్తవం ఉండవచ్చు. కొంత అవాస్తవం కూడా ఉండవచ్చు. ఈ వ్యవహారంలో నిందితుడు బలవన్మరణం పాల్పడకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఉంటే విచారణ జరిపి నిజంగా డబ్బులు డిమాండ్ చేసి ఉంటే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే వారు. ఏది ఏమైనా ఈ కేసులో ఎస్ఐ, కానిస్టేబుల్ సస్పెండ్ కావడంతో జిల్లాలోని పలువురు పోలీసు సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. కుటుంబానికి అసరాగా ఉండాల్సిన యువకుడు బలన్మరణం పాల్పడటం ఏంతైనా బాధాకరం.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?