NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

ఏ మాయ చేసావు జగన్!! పోలవరం పరుగులే ఇక

 

 

పోలవరం విషయంలో జగన్ మాయ చేశారు… ఇప్పటివరకు ఎవరు సాధించలేనిది సాధించారు… కేంద్రాన్ని ఒప్పించి 2018 19 అంచనాల ప్రకారం నిధులను తీసుకురావడంలో విజయం సాధించారు… చంద్రబాబు నాయుడు గత అయిదేళ్లుగా చేయలేని పని జగన్ చేసినట్లే… ఇది పోలవరానికి జగన్ ప్రభుత్వానికి పెద్ద ప్లస్… కేంద్ర జలవనరుల శాఖ తన నివేదికలో పేర్కొన్నట్లు 55 వేల కోట్లకు ఒప్పుకుంది.. అంటే ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పరంగా పరుగులు తీయడమే ముందుంది….

** పోలవరం విషయంలో బిజెపి ఇరుక్కోకుండా… ఇటు జగన్ ను హీరో చేసి కేంద్రంలో నిధులను తామే ఇచ్చినట్లు బిజెపి చెప్పుకొని… రెండు విధాలుగా లాభం పొందాలనే ప్లాన్లోభాగంగా ఇది కనిపిస్తోంది..
** రాష్ట్రంలో టిడిపి పరిస్థితి ఇప్పటికే దిగజారిపోయింది. వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రధాన పక్షంగా జగన్ ను ఢీ కొట్టాలని ప్రయత్నిస్తోంది. టిడిపిని పూర్తిగా అన్ని విషయాలను నిర్వీర్యం చేసి.. బిజెపి ప్రధాన పక్షంగా రావాలనేది అసలు ప్లాన్.
** ఆంధ్రప్రదేశ్ కు పోలవరం జీవనాడి. విభజన చట్టం సెక్షన్ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి మొత్తం వ్యయం కేంద్రమే భరించాలని ఉంది. అయితే ఇప్పటి వరకు కేంద్ర జల శక్తి శాఖ దీనిపై అనేక రకాల కొర్రి లు వేస్తోంది. 2014 అంచనాల మేరకు మాత్రమే పోలవరం నిధులు ఇస్తామని తెగేసి చెప్పిన కేంద్ర జల శక్తి లేక ఇప్పుడు తన మాట మార్చుకుంది. 2018 19 అంచనాల మేరకు ప్రాజెక్టు వ్యయం భారీగా పెరిగింది. దీంతో పాటు తాగునీరు విద్యుత్ ప్లాంట్ ఖర్చును సైతం కేంద్రం భరించేందుకు ఒప్పుకుంది. దీనివల్ల పోలవరం విషయంలో కేంద్రం ఖచ్చితంగా కట్టుబడి ఉందని బీజేపీ చెప్పుకోడానికి వీలయింది.


** టిడిపి చేయలేని పని జగన్ చేశాడని బిజెపి దానికి సహకరించిందని రెండు రకాలుగా రెండు పార్టీలు లబ్ధి పొందడానికి చెప్పుకోవడానికి ఈ పరిణామం తోడు కానుంది.
** జాతీయ ప్రాజెక్టు కావడంతో 2022 ఖరీఫ్ నాటికి పోలవరం నుంచి నీళ్లను కనుక జగన్ ఇచ్చినట్లయితే… అది జగన్ కు పెద్ద ప్లస్ అవుతుంది. అలాగే కేంద్ర పెద్దలు దానికి వచ్చి దీనికి మొత్తం మీ సహాయ సహకారాలు అందించినట్లు చెప్పకుంటే దాన్ని ప్రజెంట్ చేయడంలో బీజేపీ విజయం సాధిస్తే అది బిజెపి కు ప్లస్ అవుతుంది.
** రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఖచ్చితంగా ప్రధాన పక్షం పాత్ర పోషించాలని బీజేపీ భావిస్తున్న తరుణంలో పోలవరంకు నిధులు ఇవ్వడం ఆ వ్యూహంలో భాగంగానే భావించాలి.
** ఇక బిజెపి ఏం చేసినా దానికి కచ్చితంగా ప్రతిఫలం ఉండాలి. దాని వెనుక కచ్చితంగా ఓ ప్లాన్ ఉంటుంది. జగన్ ప్రభుత్వానికి జగన్ కు వ్యక్తిగతంగా పెద్ద ఇమేజ్ను తీసుకొచ్చే నిర్ణయం తీసుకున్న కేంద్ర పెద్దలు మరి ఈ నిర్ణయం తో జగన్ తో ఏ పని చూపించబోతున్నారు అనేది కూడా పెద్ద ప్రశ్న.
** మొత్తానికి జగన్ ఢిల్లీ టూర్ లో కలిసిన వారి దగ్గరనుంచి మంచి హామీ పొంది మాత్రమే ఇది సాధించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సమయంలో పోలవరం పరుగులు తీసి అన్ని అనుమతులు తీసుకుంటే జగన్ సమయంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నిధులు ఇస్తామని కేంద్రం ఒప్పించడం జగన్ నిజంగానే పెద్ద ఇమేజ్ ను సాధించినట్లే…

author avatar
Comrade CHE

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju