Breaking: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు రాఘవ రెడ్డికి మద్యంతర బెయిల్ ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. జూన్ 12 వ తేదీన సరెండర్ కావాలని రాఘవను సుప్రీం కోర్టు ఆదేశించింది. రీసెంట్ గా ఢిల్లీ హైకోర్టు మాగుంట రాఘవకు రెండు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. రాఘవకు మద్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని ఈడీ తప్పుబట్టింది.

బెయిల్ కోసం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఈడీ పేర్కొంది. అమ్మమ్మ బాత్రూంలో జారిపడినందుకు బెయిల్ మంజూరు చేయడం సబబు కాదని ఈడీ వాదించింది. ఐసియులో ఉన్నప్పుడు ఎవరినీ చూడడానికి అనుమతించరనీ, మాగుంట రాఘవ మాత్రమే అమ్మమ్మ ను చూసుకోవాల్సిన అవసరం లేదని ఈడీ తెలిపింది. మొదట నాయనమ్మ బాత్రూంలో జారిపడిందని చెప్పారనీ, నాయనమ్మ అయితే రాఘవ తండ్రి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారుగా చూసుకోవడానికి అన్నప్పుడు …కాదు కాదు…అమ్మమ్మ అని మళ్లీ అబద్దం చెప్పారని ఈడీ న్యాయవాది సుప్రీం కోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అదే విధంగా అంతకు ముందు ట్రైయిల్ కోర్డులో తన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందంటూ మధ్యంతర బెయిల్ కోరారని, దాన్ని ట్రయల్ కోర్టు కొట్టివేసిందన్న ఈడీ తరపు న్యాయవది ఎ ఎస్ జీ ఎస్వీ రాజు తెలిపారు. రాఘవ బెయిల్ పై విడుదలై రెండు రోజులైందనీ, ఇప్పటికే అమెను రాఘవ చూసి రావచ్చన్న ఈడీ తరపు న్యాయవాది ఎఎస్ జీ ఎస్వీ రాజు పేర్కొన్నారు. ఈడీ వాదనలకు ఏకీభవించిన సుప్రీం కోర్టు .. రాఘవ మధ్యంతర బెయిల్ ను రద్దు చేసింది.