supreme Court: సీబీఐకి సుప్రీం కోర్టు అక్షింతలు..!!

Share

supreme Court: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) పని తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ చేపట్టిన కేసులు కోర్టుల్లో నిలబడే పరిస్థితి కనిపించడం లేదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. జమ్మూకశ్మర్ లో ఇద్దరు న్యాయవాదుల అరెస్టుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో ఓ కేసు విషయంలో పంజరంలో చిలుకకు స్వేచ్చ అవసరం అంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలను న్యాయమూర్తి ప్రస్తావించారు.

supreme Court fires om cbi
supreme Court fires om cbi

సీబీఐ ఇప్పటి వరకూ ఎన్ని కేసులు నమోదు చేసింది ? ఎన్ని నిరూపితం అయ్యాయి ? ఎందరికి శిక్ష పడింది ? ఎన్ని పెండింగ్ కేసులు ఉన్నాయో ? తెలపాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్ లతో కూడిన ధర్మాసన ఆదేశించింది. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కు నోటీసు జారీ చేస్తూ సిబ్బంది, మౌలిక వసతుల లేమి కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సీబీఐ నమోదు చేసిన కేసులు న్యాయస్థానంలో ఎందుకు నిలబడటం లేదో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం కోర్టు పేర్కొన్నది.


Share

Related posts

MP RRR Letters War: ఏపి సీఎం వైఎస్ జగన్‌కు రఘురామ నాల్గవ లేఖ..! ఇందులో ఏముందంటే..!?

somaraju sharma

Eatela Rajendar: బిగ్ బ్రేకింగ్ః ఈట‌ల‌ను బ‌ర్త‌ర‌ఫ్ చేసిన సీఎం కేసీఆర్

sridhar

Ycp Leader Arrest: 1200 కోట్ల చిట్ ఫండ్ స్కామ్..! ఆ వైసీపీ నేతను అరెస్టు చేసి తీసుకువెళ్లిన ఒడిశా సీఐడీ పోలీసులు..!!

somaraju sharma