YS Viveka Murder case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో సునీత దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ మరో సారి విచారణ జరగనున్నది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపి అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ సునీత సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారణ కు స్వీకరించిన సుప్రీం కోర్టు .. హైకోర్టు మద్యంతర బెయిల్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు మద్యంతర బెయిల్ పై స్టే ఇచ్చింది. ఈ నెల 24వ తేదీ వరకూ కడప ఎంపి అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దంటూ సీబీఐ ని ఆదేశించిన సుప్రీం కోర్టు నేడు కేసు విచారణ జరపనున్నది. నేడు అవినాష్ రెడ్డి తరపున న్యాయవాదులు కూడా తమ వాదనలను వినిపించనున్నారు.

మరో పక్క సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఉన్నతాధికారులు వివేకా హత్య కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే అరెస్టు చేసిన వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను గత అయిదు రోజులుగా విచారణ జరుపుతోంది. ఈ రోజుతో వారి కస్టడీ విచారణ ముగియనున్నది. ఈ తరుణంలోనే అవినాష్ రెడ్డి కూడా మూడు రోజుల పాటు విచారణ జరిపారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలోనే వివేకా రెండో భార్య షమీమ్ నుండి స్టేట్ మెంట్ తీసుకోవడం, మరో పక్క వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని విచారణకు పిలిచి వ్యాంగ్మూలం నమోదు చేయడం జరిగింది. అదే విదంగా పులివెందులకు వెళ్లి వివేకా ఇంటిని సందర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అవినాష్ రెడ్డి నివాస పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరు నాటికి విచారణను పూర్తి చేసి నివేదిక సమర్పించాల్సి ఉండటంతో సీబీఐ వేగాన్ని పెంచింది. ఈ తరణంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టు ను ఆశ్రయించడంతో న్యాయస్థానం మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదువరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. దీనిపై సుప్రీం కోర్టు ను సునీత ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. నేడు సుప్రీం కోర్టులో విచారణకు వస్తుండటంతో ఎలాంటి తీర్పు వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. రేపు తెలంగాణ హైకోర్టులోనూ అవినాష్ రెడ్డి పిటిషన్ పై విచారణ జరగనున్నది.
చేవెళ్ల సభలో అమిత్ షా సంచలన ప్రకటన ..వాళ్లకు రిజర్వేషన్ రద్దు అంటూ