NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

 Supreme Court : ఏబీవీ సస్పెన్షన్ పై విచారణను మార్చి 9కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు

Supreme Court : ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌పై విచారణను సుప్రీం కోర్టు మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీప్ గా బాధ్యతలు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుపై వైసీపీ ప్రభుత్వం..నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తొలుత తన సస్పెన్షన్ పై ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. తదుపరి ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని, పెండింగ్ జీత భత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

Supreme Court hears ab Venkateshwara Rao suspension petition
Supreme Court hears ab Venkateshwara Rao suspension petition

అయితే ప్రభుత్వం ఈ ఉత్తర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏబీవీ సస్పెన్షన్ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఏడాది నుండి సస్పెన్షన్ పొడిగింపుపై సర్వీస్ నిబంధనలు చూపించాలని జస్టిస్ ఎంఎం ఖన్ విల్కర్, జస్టిస్ దివిశ్ మహేశ్వరి ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని రూల్ 3-1 కింద సస్పెన్షన్ పొడిగించామని ప్రభుత్వ తరపు న్యాయావాది ధర్మాసనానికి వివరించారు. రివ్యూ కమిటీ నిర్ణయం ప్రకారం ఆరు నెలల తర్వాత పొడిగించినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు పై అవినీతి చార్జి లేదని, రూల్ 3 లోని 1బి ప్రకారం ఏడాది కంటే ఎక్కువగా సస్పెన్షన్ ఉండటానికి వీలులేదని ఏబీవీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదించారు. అలాంటప్పుడు రివ్యూ కమిటీ ఆదేశాలను ఎందుకు సవాల్ చేయలేదని ఏబీవీ తరపు న్యాయవాదిని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. రివ్యూ కమిటీ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేయడానికి న్యాయవాది  మూడు రోజులు గడువు కోరగా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. రివ్యూ కమిటీ ఆదేశాలపై సవాల్ చేసిన మూడు రోజులలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపి ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!