ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాల పెంపు అంశం ఏపి పునర్విభజన చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. శాసనసభా స్థానాల పెంపునకు ఏపి, తెలంగాణ రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగి ఏనిమిదేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయలేదు. జనాభా గణన సాకుగా చూపి కేంద్రం ఇప్పట్లో అసెంబ్లీ స్థానాల పెంపు కుదరదని చెబుతోంది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఈ అంశం ఉండటంతో దీనిపై కేంద్రానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ ప్రతివాదులుగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపి, తెలంగాణ ప్రభుత్వాలను చేర్చారు. ఈ పిటిషన్ పై విచారణ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది.

Supreme Court

 

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపిలో 175 గా ఉన్న అసెంబ్లీ సీట్లను 225కు, అదే విధంగా తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ సీట్లను 153 కు పెంచాలన్న ప్రతిపాదన ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. విభజన చట్టం నిబంధనలు అమలు అయ్యేలా చూడాలని కోరారు. విభజన చట్టంలో సీట్ల సంఖ్యను పెంచాలని పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ శాసనసభ స్థానాలను పెంచకుండా జాప్యం చేస్తుందని, వెంటనే చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను విచారణ ను విచారించిన సుప్రీం కోర్టు.. కేంద్ర ప్రభుత్వంతో పాటుగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.

అతను నిన్నటి వరకూ సాధారణ ఆటో డ్రైవర్ .. నేటి నుండి కోటీశ్వరుడు


Share

Related posts

శరీరం అంతా  స్లిమ్ గా ఉండి …పొట్ట మాత్రమే పెద్దగా ఉంది అని బాధ పడుతున్నారా? ఇది మీకు మంచి పరిష్కారం!!

siddhu

Breaking: కొత్త చీఫ్ సెక్రటరీని నియమించిన ఏపీ ప్రభుత్వం..!!

P Sekhar

Health : లాలా జాలం ఒక అద్భుతమైన ఔషదం అని మీకు తెలుసా?ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు!!

siddhu