Supreme court: ఉత్తరప్రదేశ్‌లోని అయిదు నగరాల్లో లాక్ డౌన్ విధించాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు నిలుపుదల చేసింది. కరోనా ఉధృతి నేపథ్యంలో యూపిలోని లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్, వారణాసి, కాన్ఫూర్, గోరఖ్‌పూర్ లలో ఏప్రిల్ 26వ తేదీ వరకూ లాక్ డౌన్ విధించాలని అలహాబాద్ హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. లాక్ డౌన్ సమయంలో వివాహాలు, సామూహిక కార్యక్రమాలపై నిషేదం విధించింది. ముందుగా నిర్ణయించుకున్న వివాహాలను కేవలం 25 మందితో నిర్వహించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే ఈ తీర్పును ముఖ్యమంత్రి యోగి అతిత్యనాథ్ తీవ్రంగా వ్యతిరేకించింది.
యోగి ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. లాక్ డౌన్ విధించే అంశం న్యాయ వ్యవస్థ పరిధిలోనిది కాదని యూపి ప్రభుత్వ తరపు న్యాయవాది తుషార్ మోహతా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌ఏ బొబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదల చేసింది.
ఉత్తరప్రదేశ్ లో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 28వేలకు పైగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. 167 మంది కరోనా కారణంగా మృతి చెందారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రభుత్వం వారాంతపు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది.
Salman Khan: ప్రస్తుతం చాలావరకు సినిమా నిర్మాణానికి సంబంధించి సౌత్ ఇండియా టాలెంట్ హవా కొనసాగుతుంది. ఈత బాలీవుడ్(Bollywood) స్టార్…
Indian Film Industry: 2020 నుండి మహమ్మారి కరోనా(Corona) కారణంగా సినిమా ఇండస్ట్రీ రెండు సంవత్సరాలు గడ్డు కాలం చూడటం…
Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ వారం రోజుల కరోనా బారిన పడ్డ విషయం తెలిసిందే. కరోనా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో…
BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…
Shruti Haasan: తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాసన్…
Dasara: న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ `దసరా`.…