NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు .. సీబీఐపై సుప్రీం కోర్టు సీరియస్

Share

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవేళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివేకా హత్య కేసు దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివేకా హత్య కేసు విచారణ ఎంత వరకు వచ్చిందో చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణకు సంబంధించి తాజా పరిస్థితిపై నివేదికను సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది. అసలు ఇన్ని రోజులుగా వివేకా హత్య కేసు దర్యాప్తు ఎందుకు పూర్తి చేయడం లేదని సీబీఐపై సుప్రీం కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దర్యాప్తు అధికారి ఎందుకు విచారణ జాప్యం చేస్తున్నారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. విచారణను త్వరగా ముగించకపోతే వేరే దర్యాప్తు అధికారిని ఎందుకు నియమించకూడదో చెప్పాలని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు అధికారి సమర్ధవంతుడు కాకపోతే ఆయన స్థానంలో వేరొకరిని నియమించడంపై సీబీఐ డైరెక్టర్ అభిప్రాయం అడిగి చెప్పాలని సీబీఐ తరపు న్యాయవాది నటరాజన్ ను న్యాయస్థానం అదేశించింది.

YS Viveka Murder Case

 

సుప్రీం కోర్టులో వివేకా హత్య కేసు నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై ఇవేళ విచారణ జరిగింది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ ను మార్చాలని తులసమ్మ పిటిషన్ లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే దర్యాప్తు అధికారి బాగానే పని చేస్తున్నారని కోర్టుకు సీబీఐ తరపు న్యాయవాది బదులిచ్చారు. ఈ క్రమంలో దర్యాప్తు ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పురోగతిపై సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మరో పక్క వివేకా హత్య కేసులో విచారణను ఎదుర్కోవాల్సి ఉన్న వైఎస్ భాస్కరరెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసులో నాల్గవ నిందితుడు దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ బాస్కరరెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్ మెంట్ ఆధారంగా తమను నేరంలోకి నెట్టడం సమంజసం కాదనీ, సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్ మెంట్ ఇస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడనీ, కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరియే అని, బెయిల్ సమయంలోనూ సీబీఐ సహకరించిందన్నారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని, దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ లో బాస్కరరెడ్డి పేర్కొన్నారు.

దేశంలోనే అతి పెద్ద కుంభకోణం స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ అంటూ చంద్రబాబుపై ఆరోపణలు చేసిన సీఎం జగన్  


Share

Related posts

రామ‌తీర్థం వివాదం … హాట్ అప్‌డేట్ ఏంటో తెలుసా?

sridhar

ఎయిర్‌టెల్ ఖాతాదారులకు భారీ షాక్!

Mahesh

చైనా పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అవ్వబోతున్న ఇండియా – మోడీ సీరియస్ !

sekhar