Chandrababu Arrest: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఏపీ సర్కార్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్కిల్ డవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెండ్యాల శ్రీనివాస్ పీఎస్ గా పని చేశారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఏపీ సచివాలయం ప్లానింగ్ డిపార్ట్ మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ అతిక్రమించినందుకు గానూ శ్రీనివాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో పెండ్యాల శ్రీనివాస్ ముఖ్య పాత్ర ఉందని సీఐడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ద్వారానే చంద్రబాబుకు నిధులు చేరాయని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. కేసు విషయం తెలియగానే ప్రభుత్వ ఆనుమతి లేకుండా శ్రీనివాస్ అమెరికాకు పారిపోయారు. ఈ క్రమంలో నిన్నటిలోగా తిరిగి రావాలని ప్రభుత్వం నోటీసులు ఇచ్చినా ఆయన వెనక్కి రాకపోవడంతో ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
పెండ్యాల శ్రీనివాస్ ఈ నెల 11 నుండి తనకు సెలవు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఐటీ నోటీసుల వ్యవహారం బయటకు రాగానే ఈ నెల 6న హైదరాబాద్ నుండి అమెరికాకు వెళ్లిపోయినట్లు సీఐడీ గుర్తించింది. మరో పక్క నారా లోకేష్ సన్నిహితుడు రాజేశ్ కూడా దేశం వదిలి అమెరికాకు పారిపోయిన విషయం తెలిసిందే. అలానే ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్ధసాని దుబాయ్ కు పారిపోయినట్లు సీఐడీ గుర్తించింది.
YS Sharmila: వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై తేల్చని కాంగ్రెస్ అధిష్టానం ..కింకర్తవ్యం..?