ఏపి అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల నిరసనలు, సస్పెన్షన్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో ఆరవ రోజైన ఆదివారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వాయిదా తీర్మానం కోరుతూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ చార్జీలపై టీడీపీ వాయిదా తీర్మానం కోరింది. అయితే సభ వాయిదాకు ముందే వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ చేస్తున్న ఆందోళనల మధ్యే సభలో డిమాండ్స్ ను మంత్రులు ప్రవేశపెడుతున్నారు.

ఈ క్రమంలోనే మోటర్లకు మీటర్లు… రైతులకు ఉరి తాళ్లు అంటూ ప్లకార్డులతో టీడీపీ నిరసన చేపట్టింది. రూ.6వేల కోట్ల కుంభకోణం మోటర్లకు మీటర్లు అంటూ టీడీపీ ఆందోళనకు దిగింది. స్పీకర్ పోడియం ను టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. దీంతో కొద్దిసేపు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ 11 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, ఆదిరెడ్డి భవానీ, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు తదితరులను వరుసగా ఆరోవ రోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపించారు.
అయతే వ్యవసాయ మీటార్లకు మీటర్లు అంశంపై ఏపి విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటర్ల వల్ల 33 శాతం విద్యుత్ ఆదా అవుతుందని తెలిపారు. టీడీపీ, కమ్యూనిస్టులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శ్రీకాకుళంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు స్మార్ట్ మీటర్లు కాదని డిజిటల్ మీటర్లు మాత్రమేనని, పైలట్ ప్రాజెక్టుగా ఆ ప్రాంతంలో డిజిటల్ మీటర్లు బిగించామని వెల్లడించారు. రాష్ట్రంలో పది వేల మంది మినహా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చారని మంత్రి తెలిపారు. రైతులకు తొమ్మిది గంటల పగటి పూటే ఉచిత విద్యుత్ ఇస్తున్నామనీ, కేవలం గృహ వినియోగదారులకు మాత్రమే స్మార్ట్ మీటర్లు పెట్టాలని భావిస్తున్నామని అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాలను రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
TDP MLC: ముగిసిన డిక్లరేషన్ వివాదం .. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ అందజేత