Pawan Kalyan: టార్గెట్ పవన్ కళ్యాణ్..! భీమవరంలో జగన్ స్కెచ్ ఇదీ..!!

Share

Pawan Kalyan: రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీ నేతలను దెబ్బ తీయడానికి అనేక స్ట్రాటజీలను అమలు చేస్తుంటారు. రాష్ట్రంలో అధికార వైసీపీ..ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా పావులు కదిపింది. ఆయన సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ విజయం సాధించేలా వ్యూహాలను అమలు చేసింది. సక్సెస్ అయ్యింది. ఇక వైసీపీకి రాష్ట్రంలో మరో ప్రత్యర్ధిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను మరో సారి దెబ్బతీసే లక్ష్యంగా వ్యూహాలను అమలు చేస్తోంది. గడచిన ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి రెండు చూట్ల పరాజయం పాలైన సంగతి తెలిసిందే. అందులో భీమవరం నియోజకవర్గం ఒకటి. ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన గ్రంధి శ్రీనివాస్ కేవలం 8 వేల ఓట్ల తేడాతో పవన్ కళ్యాణ్ పై విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధికి 54వేల ఓట్లు, పవన్ కళ్యాణ్ కు 62వేల ఓట్లు రాగా, విజయం సాధించిన గ్రంధి శ్రీనివాస్ కు 70వేల ఓట్లు వచ్చాయి. ఆనాడు టీడీపీ, జనసేన వేరువేరుగా పోటీ చేయడం వల్ల వైసీపీకి ప్లస్ అయ్యిందనీ, లేకుంటే పవన్ కళ్యాణ్ సునాయాసంగా విజయం సాధించే వారని ఆ పార్టీ వాళ్లతో సహా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే భీమవరంలో వైసీపీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో భీమవరంను పూర్తి స్థాయిలో వైసీపీకి కంచుకోటగా మార్చేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

Target Pawan Kalyan in bhimavaram
Target Pawan Kalyan in bhimavaram

Pawan Kalyan: ఆయా వర్గ నేతలకు పదవులు

భీమవరంలో సుమారు 2 లక్షల 53వేల వరకూ ఓటర్లు ఉన్నారు. ఓ అంచనా ప్రకారం వీరిలో కాపు సామాజిక వర్గ ఓటర్లు 80వేల వరకూ ఉంటారు. ఆ తరువాత శెట్టి బలిజ, గౌడ సామాజిక వర్గ ఓటర్లు 40 నుండి 50వేల వరకూ, ఎస్సీ సామాజికవర్గ ఓటర్లు 30 వేలు, అగ్నికుల క్షత్రియ సామాజికవర్గ ఓటర్లు 15 వేలు, క్షత్రియ ఓటర్లు 8 వేలు, ముస్లిం మైనార్టీ ఓటర్లు సమారు 5 వేల వరకూ ఉంటారు. రాబోయే ఎన్నికల్లో ఒక వేళ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినా వారికి ఓటింగ్ పెరగకుండా ఉండేందుకు గానూ ఇతర సామాజిక వర్గాలను అకర్షించే పనిలో వైసీపీ పడింది. ఈ క్రమంలోనే కాపు సామాజికవర్గం తరువాత బలంగా ఉన్న శెట్టి బలిజ, గౌడ వర్గాలకు వైసీపీ పదవులు కట్టబెడుతోంది. ఆ వర్గాల్లో బలమైన నేతగా ఉన్న భీమవరంకు చెందిన వేండ్ర వెంకట స్వామికి డీసీఎంఎస్ చైర్మన్ పదవి ఇచ్చింది. అదే విధంగా శెట్టి బలిజ, గౌడ కార్పోరేషన్లలోనూ భీమవరం కు చెందిన వారికి డైరెక్టర్ పదవులు ఇచ్చింది. మరో పక్క నియోజకవర్గంలో ఆర్ధికంగా బలమైన క్షత్రియ సామాజికవర్గం టీడీపీ వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు గానూ మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును క్షత్రియ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు బలమైన గోకరాజు కుటుంబాన్ని పార్టీకి అనుకూలంగా చేసుకుంది వైసీపీ.

మోషేన్ రాజుకు శాసనమండలి చైర్మన్ పదవి

ఇప్పుడు తాజాగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో పాటు శాసనమండలి చైర్మన్ గా చేసి గౌరవించింది జగన్ సర్కార్. కొయ్యే మోషేన్ రాజు భీమవరం మున్సిపాలిటీలో 20 ఏళ్ల వయసులోనే కౌన్సిలర్ గా ఎన్నికైయ్యారు. ఆ తరువాత వరుసగా మూడు సార్లు కౌన్సిలర్ గా విజయం సాధించారు. సుమారు 20 ఏళ్ల పాటు కౌన్సిలర్ గా సేవలంచిన నేపథ్యంలో ఆయనకు ఎస్సీ సామాజికవర్గంతో పాటు అన్ని వర్గాల్లోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలో మోషేన్ రాజుకు సీఎం జగన్మోహనరెడ్డి శాసనమండలి చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించారు. నియోజకవర్గంలో వైసీపీ మరింత బలోపేతం చేసే క్రమంలో భాగంగా అక్కడి నేతలకు పదవులు ఇస్తూ ప్రత్యేక స్ట్రాటజీ అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇవన్నీ కూడా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తున్న వ్యూహాత్మక చర్యలుగా అనుకోవాల్సిందేగా?.

 

 


Share

Related posts

అమరావతిలో పర్యటించనున్న చంద్రబాబు

Mahesh

Big Breaking: తమిళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ హీరోగా బండ్ల గణేష్..!!

P Sekhar

Breaking: Dollar Seshadri: టీటీడీ ఓఎస్డి డాలర్ శేషాద్రి గుండెపోటుతో మృతి..!!

P Sekhar