TDP: చంద్రబాబుకు అనంతపురం జిల్లా టీడీపీ యువనేత బిగ్ షాక్..! సీటు ఇవ్వకుంటే ఝలక్కే..!?

Share

TDP: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు లేవు. కానీ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళుతున్నాయి. ఇప్పటి నుండి నియోజకవర్గాల్లో తమ హవా నిలబెట్టుకునేందుకు నేతలు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు తెరమీదకు వస్తున్నాయి. ఎన్నికల హీట్ మొదలవుతోంది. తాజాగా అనంతపురం జిల్లాలోని ఓ టీడీపీ యువనేత చేసిన షాకింగ్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు, ధర్మవరం పార్టీ ఇన్ చార్జి పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో సంచలనంగా మారాయి. ధర్మవరం టికెట్ తనకు కాదని మరొకరికి ఇస్తే టీడీపీకి గుడ్ బై చెప్పి రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

TDP anantapur youth leader sensational comments
TDP anantapur youth leader sensational comments

TDP: పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో పరిటాల కుటుంబానికి బలమైన వర్గం ఉంది. ధర్మవరంలో మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి), పరిటాల వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. గత కొద్ది రోజులుగా సూరి ధర్మవరం టికెట్ తెచ్చుకుంటారని ఆయన వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారంపై సీరియస్ గా స్పందించిన పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం వదులుకునే ప్రశ్న లేదని తేల్చి చెప్పడంతో పాటు ఒక వేళ పార్టీ అధినేత పార్టీ అధినేత చంద్రబాబు తనకు టికెట్ కన్పర్మ్ చేయకపోతే రాజకీయాల నుండే నిష్క్రమిస్తానని తెగేసి చెప్పారు.

గత ఎన్నికల్లో రాప్తాడు నుండి పోటీ చేసి తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి చేతిలో పరాజయం పాలైన పరిటాల శ్రీరామ్ రాబోయే ఎన్నికల్లో ధర్మవరం నుండి పోటీ చేయడానికి ఇప్పటి నుండి సన్నాహాలు ప్రారంభించారు. రాప్తాడులో తన తల్లి సునీత పోటీ చేయనుండగా పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలు, ప్రజలతో మమేకం అవుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీదే అధికారమని చెబుతున్న పరిటాల శ్రీరామ్ ధర్మవరం విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. శ్రీరాం చేసిన సంచలన కామెంట్స్ పై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Share

Related posts

Allu Arjun: కొరటాల – అల్లు అర్జున్ సినిమా అందుకే ఆగిపోయిందట..??

sekhar

Vakeel Saab : వకీల్ సాబ్ నుంచి మరో వీడియో సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..!!

bharani jella

కేజీఎఫ్ చాప్టర్ 2 : యాష్ ఫాన్స్ కి థ్రిల్ ఇస్తున్న ప్రశాంత్ నీల్ కామెంట్ !

GRK