Chandrababu: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. మరో 8 నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. అధికార వైసీపీ సహా టీడీపీ, జనసేన అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టింది. ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలపై వ్యతిరేకత ఉన్న చోట్ల వైసీపీ కొత్త గా సమన్వయకర్తలను నియమిస్తొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్ర సమయంలో పలు నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను మార్పు చేశారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఇన్ చార్జిలు లేని నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు.
తాజాగా వైఎస్ఆర్ జిల్లా కడప, గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జిలను టీడీపీ నియమించింది. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిగా ఆర్ మాధవీ రెడ్డి, ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ చార్జిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బీ రామాంజనేయులులను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు నియమించారు. అయితే దాదాపు మూడు దశాబ్దాలుగా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి ముస్లిం మైనార్టీ నేతలే ఎమ్మెల్యేగా ఎన్నిక అవుతూ ఉండగా, టీడీపీ ముస్లిం మైనార్టీ వర్గాని కాకుండా వేరే సామాజికవర్గానికి టికెట్ కేటాయించడం విశేషం.
కడప అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014, 2019 లో వరుసగా వైసీపీ అభ్యర్ధి అమ్ జాద్ బాషా విజయం సాధించారు. రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్ధిగా అమ్ జాద్ బాషా పోటీ చేయనున్నారు. 2014కు ముందు నాలుగు సార్లు ముస్లిం మైనార్టీ నేతలే ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. కడప అసెంబ్లీ టీడీపీ అభ్యర్ధిత్వాన్ని జిల్లా టీడీపీ నేత ఆర్ శ్రీనివాసరెడ్డి సతీమణి మాదవీ రెడ్డి, కడప మున్సిపల్ కార్పోరేషన్ లో ఏకైక టీడీపీ కార్పోరేటర్ ఉమాదేవితో పాటు పలువురు ముస్లిం నేతలు ఆశిస్తున్నారు. ఈ తరుణంలో చంద్రబాబు శ్రీనివాసరెడ్డి భార్య మాధవీ రెడ్డికి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నియమించారు.
మరో పక్క గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా మేకతోటి సుచరిత ఉన్నారు. జగన్ తొలి కేబినెట్ లో హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమెను మంత్రి వర్గం నుండి తొలగించిన తర్వాత తీవ్ర అసంతృప్తికి గురైయ్యారు. పార్టీకి రాజీనామా చేస్తారని వార్తలు వచ్చాయి. పార్టీ అధిష్టానం బుజ్జగింపులతో ఆమె మెత్తపడ్డారు. అదే క్రమంలో సుచరితకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించినా ఆమె కొనసాగలేదు. తాను పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించలేనని తప్పుకున్నారు. ఈ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన డొక్కా మాణిక్య వరప్రసాద్ అనంతరం వైసీపీ గూటికి చేరారు. దీంతో ఇక్కడ ఇన్ చార్జిని నియమించాల్సిన పరిస్తితి టీడీపీకి ఏర్పడింది. రిటైర్డ్ ఐఏఎస్ రామాంజనేయులును పార్టీ ఇన్ చార్జిగా నియమించారు.
AP CID: ఆ టీడీపీ ఎమ్మెల్యే కుటుంబానికి ఏపీ సర్కార్ బిగ్ షాక్ .. రూ.9 కోట్ల విలువైన ఆస్తులు జప్తు