NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP Politics: జగన్ తో అంత వీజీ కావట్లేదా.. విపక్షాలకి..???

tdp bjp janasena trying to irk ysrcp

AP Politics:  అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శించుకోకుంటే అది రాజకీయమే కాదు. అధికారం మారిన తర్వాత మొదటి ఏడాది అధికార పార్టీకి హనీమూన్ అయితే.. ప్రతిపక్షాలకు రిలాక్షేషన్. రెండో ఏడాది విమర్శలు మొదలుపెడతారు. మూడో ఏడాది ప్రజలకు ప్రభుత్వం తప్పులు చూపిస్తారు.

నాలుగో ఏడాది రావడంతోనే ఎన్నికల ప్రక్రియ దాదాపు మొదలయినట్టే. ప్రభుత్వంపై ముప్పేట దాడి మొదలుపెట్టి విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లడానికి మళ్లీ అలవాటు పడుతూంటారు. ఎన్నికలు ఎంత త్వరగా వస్తే అంత బెటర్.. మన సత్తా చాటేద్దాం.. అధికారం మనదే అనే ఊహల్లో ఉంటారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు అలానే ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంటే.. టీడీపీ, బీజేపీ, జనసేన తమ పని తాము చేసుకుంటున్నాయి.

AP Politics: tdp bjp janasena trying to irk ysrcp
AP Politics tdp bjp janasena trying to irk ysrcp

AP Politics: విపక్షాల ముప్పేట దాడి..

ముఖ్యంగా సీఎంగా జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి ప్రజలకు వివరిస్తున్నారు. రోడ్ల పరిస్థితి, ఇసుక రేట్లు.. ఇలా ప్రజల్లోకి ప్రభుత్వ పని తీరుని ఎండగడుతున్నారు. అమరావతే రాజధానిగా ఉండాలంటూ బీజేపీ, టీడీపీ, జనసేన డిమాండ్ చేస్తూ వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సోము వీర్రాజు ఏకంగా తాము అధికారంలోకి వస్తే 75కే మద్యం పంపిణీ చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమితో, సంస్థాగత ఇబ్బందులతో వైసీపీని టీడీపీ ఎదుర్కోలేకపోతోంది. అయితే.. రాష్ట్రం అప్పులకుప్ప అవుతోంది.. సీఎంగా జగన్ విఫలం.. వచ్చే ఏడాదే ఎన్నికలు అంటూ ఉనికి చాటుకుంటోంది టీడీపీ. పవన్ కల్యాణ్ ఒక్కసారే విరుచుకుపడి కొన్నాళ్ల వరకూ కావాల్సిన స్టఫ్ ఇచ్చేస్తున్నారు.

జగన్ ను ఇబ్బంది పెట్టగలరా..

సీఎం జగన్ మాత్రం తాను ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ.. పథకాల అమలులో ఇబ్బందులున్నా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. పారదర్శకంగా ప్రజలకు మేలు జరగడం, పధకాలు అమలవుతూండటంతో జగన్ వాళ్లెవరికీ అవకాశం ఇవ్వడం లేదు. కేవలం పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నారు. ఇదే జగన్ పై గతంలో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం.. అనంతర పరిస్థితులు తెలిసిందే.

అయితే.. మూడేళ్లుగా ఇన్ని పధకాలు అమలవుతున్నా.. జగన్ పై అవినీతి ఆరోపణలు మాత్రం ప్రతిపక్షాలు చేయకపోవడం.. జగన్ సాధించిన విజయంగానే చెప్పాలి. అయితే.. జగన్ ఎదుర్కొనేందుకు పార్టీలు కొత్త దారులు వెతుకుతాయనడంలో అతిశయోకతి లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ తమ గేమ్ స్టార్ట్ చేశాయనే చెప్పాలి.

author avatar
Muraliak

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!