ఏపి శాసనమండలిలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల టీడీపీ ఘన విజయం సాధించగా, పశ్చిమ రాయలసీమలో మాత్రం వైసీపీ, టీడీపీ అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఇక్కడ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగింది. ప్రతి రౌండ్ లోనూ టీడీపీ, వైసీపీ బలపర్చిన అభ్యర్ధుల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ నడిచింది. అనంతరం జేఎన్టీయూలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శనివారం కూడా కొనసాగింది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో అభ్యర్ధుల గెలుపునకు కావాల్సిన ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు నిర్వహించారు.

చివరకు టీడీపీ బలపర్చిన అభ్యర్ధి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి 7543 ఓట్ల మెజార్టీతో వైసీపీ బలపర్చిన వెన్నపూస రవీంద్ర రెడ్డి పై విజయం సాధించారు. అయితే కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. రీకౌంటింగ్ చేయాలని నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ అభ్యర్ధి వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతిక విజయం వైసీపీదేనని అన్నారు. కౌంటింగ్ అక్రమాలపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
ఓట్ల తారుమారుపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. తొలి రెండు రౌండ్లలో తనకు మెజార్టీ వచ్చిందన్నారు. స్వతంత్ర అభ్యర్ధి తరపున టీడీపీ నేతలు కౌంటింగ్ ఏజంట్లుగా ఉండటం అనైతికమని, వైసీపీ, స్వతంత్రుల ఓట్లు టీడీపీ ఖాతాలో వేశారని ఆరోపించారు. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకూ స్పందన లేదని మండిపడ్డారు. పది రౌండ్లలో తనకు మెజార్టీ వచ్చిందని తెలిపారు.
సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్సీ స్థానం కోల్పోవడానికి కారణం అదేనందుట ఆ పార్టీ నేత