TDP: రాష్ట్రంలో టీడీపీకి ఈ దారుణమైన పరిస్థితి రావడానికి కారణాలు ఇవే..!?

Share

TDP: ఉమ్మడి రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో దాదాపు జెండా పీకేసింది. నవ్యాంధ్ర ప్రదేశ్ లో తొలి ముఖ్యమంత్రి హోదాను చంద్రబాబు దక్కించుకున్నా రాష్ట్ర అభివృద్ధి, ప్రగతి, అధ్భుత రాజధాని అంటూ ఏవేవో చెప్పారు. కానీ పార్టీ బలోపేతాన్ని పూర్తి నిర్లక్ష్యం చేశారు. రాజకీయ పార్టీ అంటే నమ్మకమైన నాయకత్వం ఉండాలి. నాయకత్వంపై నమ్మకం ఉంటేనే క్యాడర్ కసిగా పని చేస్తుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య ఈ విషయంలో చాలా తేడా ఉందని ఆయా పార్టీల నేతలే అంటుంటారు. జగన్ కు నమ్మకమైన నేతలు ఉన్నారు. కానీ చంద్రబాబుకు ప్రస్తుతం ఎవరూ కనబడటం లేదు. కసితో పని చేసే క్యాడర్ కూడా చాలా జిల్లాల్లో సైలెంట్ అయ్యారు. అందుకు చంద్రబాబు స్వయంకృతాపరాధమేనని అంటుంటారు. చంద్రబాబు మనస్థత్వం తెలిసిన వాళ్లే ఈ మాటలు అంటుంటారు. ఎందుకంటే చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో ఉన్నప్పుడు మరోలా ఉంటారనీ, అవసరానికి వాడుకుని ఆ తరువాత పక్కన పెట్టేస్తారని పేర్కొంటుంటారు.

TDP chandrababu politics
TDP chandrababu politics

TDP: అధికారంలో ఉండగా అలా..

అధికారంలో ఉన్న సమయంలో వీడియో కాన్ఫరెన్స్ అంటూ గంటల తరబడి మీటింగ్ లు ఇవ్వడం, ఐఏఎస్ లు, ఉన్నతాధికారులు చెప్పిన మాటలే వింటూ నాయకుల మాటలను లెక్క చేసే వారు కాదట. నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుతో మూడు దశాబ్దాలుగా ఆయనతో దగ్గరగా ఉన్న వారు పార్టీలో అనేక మంది ఉన్నారు. కానీ కష్టకాలంలో వారెవరూ చంద్రబాబుకు ఉపయోగపడటం లేదు. అందుకు కారణఁ చంద్రబాబు వైఖరేనంట. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎవరినీ పట్టించుకునే వారు కాదట. మంత్రులను స్వేచ్చగా పనులు చేసుకోనివ్వకుండా అన్ని శాఖలపైనా ఆయన రివ్యూలు నిర్వహిస్తుండేవారు. పలు జిల్లాల్లో సొంత బలం, సత్తాతో గెలిచిన నేతలకు సైతం సరైన ప్రాతినిధ్యం, గౌరవం ఇవ్వకపోగా వారిని మరింత దూరం పెడతారన్న అభిప్రాయం కూడా నేతల్లో ఉండేది.

TDP: జగన్ కు వీళ్ల ఉన్నారు

ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి, చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కృష్ణాజిల్లాలో కొడాలి నాని, పేర్ని నాని వంటి వాళ్లు ప్రతి జిల్లాకు ఉన్నారు. జగన్మోహనరెడ్డి నాయకత్వంలో కసిగా పని చేసే నేతలు అనేక మంది స్పష్టంగా కనిపిస్తుంటారు. కానీ చంద్రబాబుకు అంటువంటి వాళ్లు దుర్భిణి వేసి చూసినా కనిపించే వారు లేరు. చంద్రబాబు హయాంలో పదవులు అనుభవించిన వాళ్లూ పార్టీ కోసం ఖర్చు చేయడానికి ముందుకు రావడం లేదు. ఈ కారణాల వల్లనే టీడీపీ వరుస పరాజయాలు. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్ ఉంది. కానీ చాాల జిల్లాల్లో, నియోజకవర్గాల్లో నాయకత్వ లోపం ఉందని అంటున్నారు. టీడీపీకి ఉన్న బలానికి ఇంత దారణమైన ఓటములు ఎవరూ ఊహించరు. నెల్లూరు జిల్లాలో టీడీపీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ నగర పాలక సంస్థ ఎన్నికల్లో ఒక్క డివిజన్ కూడా గెలవలేదు అంటే అక్కడ ఆ పార్టీ నాయకత్వ తీరుకు అద్దం పడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ఘోర పరాజయానికి వైసీపీ అధికార దుర్వినియోగం అని కారణాలు చూపుతున్నారు. టీడీపీ ఓటింగ్ శాతం పెరిగిందని అని సంతోషిస్తున్నారు కానీ పార్టీలో లోపాలను సమీక్షించడం లేదన్న మాట వినబడుతోంది.


Share

Related posts

‘మాది ఆపధర్మ ప్రభుత్వం కాదు’

somaraju sharma

సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ ట్రైలర్ టాక్ ఏంటీ ఇలా ఉంది ..?

GRK

సి‌బి‌ఐ ఎందుకు సైలెంట్ అయ్యింది..!!

sekhar