NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: ఎన్నికలపై చంద్రబాబు సరికొత్త డిమాండ్..!!

TDP: పరిషత్ ఎన్నికలకు బ్రేక్ వేస్తూ ఏపి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం, ఎస్ఈసీ హైకోర్టు డివిజన్ బెంచ్ కి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నది. పిటిషన్ దాఖలు చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని మీడియాకు వెల్లడించారు.  కాగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారు. చట్ట విరుద్ద ఎన్నికలకు టీడీపీ బహిష్కరించడం సరైందని కోర్టు తీర్పుతో రుజువు అయ్యిందని చంద్రబాబు పేర్కొన్నారు.

TDP chief chandra babu comments on local body elections
TDP chief chandra babu comments on local body elections

సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్దంగా పరిషత్ ఎన్నికలకు వెళ్లడాన్ని హైకోర్టు నిలుపుదల చేయడం అంబేద్కర్ రాజ్యాంగ విజయమని పేర్కొన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్న వైసీపీ ప్రభుత్వ అరాచకానికి ఇది ఒక చెంపపెట్టుగా ఆయన అభివర్ణించారు. ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగాన్ని విడనాడి అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తిని స్వీకరించి పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నుండి ఎన్నికలను ప్రారంభిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. న్యాయస్థానాల మార్గదర్శకాలను దిక్కరించే విధానాన్ని జగన్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల కమిషన్ చట్ట ప్రకారం స్వతంత్రంగా వ్యవహరించాలని గానీ రబ్బర్ స్టాంప్ లాగా మారకూడదని వ్యాఖ్యానించారు.

ఈ నెల 1వ తేదీ ఎస్ఈసీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని అదే రోజు సాయంత్రం ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది మార్చి నెలలోనే పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ, ఉపసంహణల ప్రక్రియ పూర్తి అయింది. నాడు కరోనా నేపథ్యంలో వాయిదా పడగా ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతో ఆగిందో అక్కడి నుండి ప్రారంభిస్తూ నూతన ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. ఎస్ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్ సవాల్ చేస్తూ బీజేపీ, జనసేన, టీడీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju