NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: చంద్రబాబు మరో కీలక నిర్ణయం..? జగన్ వ్యవస్థకు పోటీగా…

TDP: ఆంధ్రప్రదేశ్ లో వరుస పరాజయాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఓ కీలక నిర్ణయానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నారని వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్య మంత్రి అయిన తరువాత జరిగిన దాదాపు అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అసెంబ్లీలోనూ సంఖ్యాబలం చాలా తక్కువగా ఉండటంతో అధికార వైసీపీ నుండి తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎంగానే అసెంబ్లీలోకి అడుగు పెడతానంటూ శపథం చేసి అసెంబ్లీ సమావేశాల నుండి చంద్రబాబు  బాయ్ కాట్ చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టడానికి సమీక్షలు నిర్వహిస్తున్నారు.

TDP chief chandra babu key decision
TDP chief chandra babu key decision

TDP: వైసీపీ సర్కార్‌కు వాలంటీర్ వ్యవస్థ దన్ను..?

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారికంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చింది. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ వాళ్లతో అర్జీలు పెట్టించడం, ఆ పథకాలు అర్హులకు మంజూరు అయ్యేలా చూడటం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రభుత్వం నుండి గౌరవ వేతనం పొందుతున్నా ఎన్నికల సమయంలో వీరు వైసీపీకి తమ సహకారం అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవస్థపై గతంలో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇప్పుడు గ్రామాల్లో టీడీపీ బలోపేతం కావాలంటే అటువంటి వ్యవస్థే పార్టీకి ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారుట. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన కార్యకర్తలు ఉన్నారు. ఆ కార్యకర్తల నుండే యువతీ యువకులను పార్టీ తరపున పని చేయడానికి ఎంపిక చేయాలని యోచన చేస్తున్నారుట.

TDP: టీడీపీ తరపున పార్టీ హోల్ టైమర్స్

పార్టీ ద్వారా వారికి నెలవారీ కొంత గౌరవ వేతనం ఇస్తూ వారి ద్వారా ప్రజల్లోకి ప్రభుత్వ వైఫల్యాలను వివరించడం, గత టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తెలియజేసే విధంగా విధులను అప్పగించనున్నారుట. నియోజకవర్గ ఇన్ చార్జిలతో త్వరలో  సమావేశాలను నిర్వహించి ఈ వ్యవస్థ ఏర్పాటునకు సిద్ధం అవుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉండగా వచ్చే ఏడాది నుండి కార్యకర్తల నుండి వీళ్లను నియమించుకోవాలని భావిస్తున్నారుట. పార్టీ హోల్ టైమర్ లుగా నియమించుకుంటున్న వీళ్లనే ఎన్నికల సమయంలో పోలింగ్, కౌంటింగ్ ఏజంట్ లుగా కూడా వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!