NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TDP: టీడీఎల్పీలో భిన్నాభిప్రాయాలు.. అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయం..!! చంద్రబాబు మినహా

TDP: ఏపి శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 వ తేదీ (సోమవారం) నుండి జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు టీడీపీ వెళ్లాలా వద్దా అనే దానిపై సందేహాన్ని తేల్చేశారు. చంద్రబాబు మినహా ఇతర సభ్యులు వెళ్లాలని టీడీపీ శాసనసభ పక్షం నిర్ణయించింది. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించారు. అయితే పొలిట్ బ్యూరో అభిప్రాయానికి భిన్నంగా టీడీఎల్పీ అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించడం విశేషం. చంద్రబాబు నేతృత్వంలో ఆన్ లైన్ ద్వారా జరిగిన ఈ సమావేశంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.

TDP: చంద్రబాబు బాటలోనే తాము అంటూ..

అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని కొందరు, వెళ్లవద్దని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తరువాత సమావేశాలకు వెళ్లాలని నిర్ణయించారు. గత సమావేశంలో చంద్రబాబు తాను ముఖ్యమంత్రి అయ్యే వరకూ అసెంబ్లీలోకి అడుగు పెట్టనంటూ శపథం చేసి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు బాటలోనే తాము అసెంబ్లీకి వెళ్లమని మెజార్టీ ఎమ్మెల్యేలు చెప్పినప్పటికీ, ప్రజా సమస్యలు ప్రస్తావించేందుకు అసెంబ్లీకి వెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినా ఆయన తరపున పార్టీ అసెంబ్లీలో పోరాడిన విషయాలను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

TDP: అవమానాలు భరిస్తూ ఎందుకు..

సభకు వెళ్లినా మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదనీ, అవమానకరంగా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వివరించారుట. ఇప్పటికే టీడీఎల్పీ ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడుకు మైక్ కట్ చేయాలని అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సూచించింది. ప్రివిలేజ్ కమిటి సిఫార్సులపై అసెంబ్లీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి వెళ్లి ఉపయోగం లేదని మెజార్టీ టీడీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయిదు నుండి పది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాడిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. చివరకు అసెంబ్లీకి చంద్రబాబు మినహా ఇతర సభ్యులు హజరు కావాలని టీడీఎల్పీ నిర్ణయించింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?