NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandra Babu: ఢిల్లీలో చంద్రబాబుకు చుక్కెదురు..! లభించని మోడీ, షా ఆపాయింట్‌మెంట్‌లు..! కారణం ఇదే..!!

Chandra Babu: ఆంధ్రప్రదేశ్ లో పట్టాభి ఏపిసోడ్ తదనంతర పరిణామాలపై కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ బృందానికి చుక్కెదురైంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు బృందానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్లు లభించలేదు. రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ను మాత్రం కలిసి రాష్ట్రంలో పరిస్థితులు వివరించి వినతి పత్రాన్ని సమర్పించారు. కశ్మీర్ పర్యటన ముగించుకుని అమిత్ షా ఢిల్లీకి చేరినప్పటికీ చంద్రబాబుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని సమాచారం. దీంతో అమిత్ షా ఆపాయింట్మెంట్ ఖరారు అయిన తరువాత మరో సారి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు మంగళవారం రాత్రికి హైదరాబాద్ కు చేరుకున్నారు.

TDP Chief Chandrababu delhi tour
TDP Chief Chandrababu delhi tour

Chandra Babu: ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకంతో వెళ్లి..

ఏపి సీఎం వైఎస్ జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ పై టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అలియాస్ పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆవేశానికి గురైన వైసీపీ అభిమానులు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడులకు దిగారు. దీంతో రాష్ట్రంలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడుయయ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటూ డిమాండ్ చేశారు. అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి, రాష్ట్రంలో పరిస్థితులను వివరించారు. అనంతరం ఆ ఘటనకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారు. ఇంతటితో ఆగకుండా ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షాలను నేరుగా కలిసి రాష్ట్రంలో పరిస్థితులను వివరించాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనపై ఓ పుస్తకాన్ని సైతం ముద్రించి మరీ ఢిల్లీకి తీసుకువెళ్లారు.

టీడీపీ శ్రేణులకు నిరుత్సాహం

ఎన్‌డీఏతో తెగతెంపులు చేసుకున్న తరువాత చంద్రబాబు మొట్టమొదటి సారి మోడీ, షా కు కలిసేందకు వెళ్లారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళుతున్న సమయంలోనే వైసీపీ నేతలు చంద్రబాబుకు సృంగభంగం తప్పదంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఏపికి హోంశాఖ మంత్రి అమిత్ షా వచ్చిన సమయంలో ఆయన కాన్వాయ్ పై చెప్పులు వేయించారనీ, అదే విధంగా ప్రధాన మంత్రి మోడీ పర్యటనలో నిరసన కార్యక్రమాలు చేశారనీ, ఇవన్నీ వాళ్లకు గుర్తే ఉంటుందని పేర్కొన్నారు. అయితే నాటి సంఘటనలు గుర్తు పెట్టుకుని చంద్రబాబు బృందానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదో లేక వారికి సమయం లేక అపాయింట్మెంట్ ఇవ్వలేదో కానీ చంద్రబాబు కు ఢిల్లీలో చుక్కెదురు కావడం ఆ పార్టీ శ్రేణులను నిరుత్సాహ పరిచింది. వైసీపీ శ్రేణులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N