21.7 C
Hyderabad
December 2, 2022
NewOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బాబు నోట ఆ భాషనా..? కర్నూలులో సహనం కోల్పోయి వేరావేశంతో..

Share

40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు సహనం కోల్పోయారు. వీరావేశంతో ఊగిపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరుషమైన భాషను ఉపయోగించారు. బాబు నోట అలాంటి మాటలు రావడం ఆ పార్టీ శ్రేణులతో పాటు సామాన్యులను విస్మయానికి గురి చేసింది. బాదుడే బాదుడు కార్యక్రమం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో మూడు రోజుల పర్యటన చేశారు. చంద్రబాబు రోడ్డు షోకు భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు రావడం ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే కర్నూలులో న్యాయరాజధానికి మద్దతు ఇవ్వాలంటూ రాయలసీమ న్యాయవాదుల జేేఏసి, విద్యార్ధి జేఏసి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేయడంతో హైటెన్షన్ నెలకొంది.

Chandra Babu

 

పత్తికొండ, ఎమ్మిగనూరు, ఆదోని, కర్నూలులో చంద్రబాబు పర్యటించగా, దాదాపు అన్ని చోట్ల నిరసనలు వ్యక్తం చేశారు విద్యార్దులు, న్యాయవాదులు. టీడీపీ ఆఫీసు వద్ద చంద్రబాబు సభ జరుగుతున్నంత సేవు రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు న్యాయవాదులు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కొందరు చెప్పులు కూడా విసిరారు. నిరసన వ్యక్తం చేసిన వారిపై చంద్రబాబు సహనం కోల్పోయి వీరావేశం ప్రదర్శించారు. చంద్రబాబు నోటి వెంట ఏనాడు వినని మాటలు వచ్చాయి. తమ్ముళ్లు నన్ను రెచ్చగొడుతున్నారు. “నన్ను రెచ్చగొట్టిన వాళ్లు పతనం అవ్వడం ఖాయం. నాకు వచ్చిన కోపానికి చెప్పు చూపించాలి కానీ చూపించలేదు. ఇది నా సభ్యత, నాకు హుందా తనం” ఉంటూనే పచ్చి బూతులు, రెచ్చగొట్టే మాటలతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు.

“పనికి మాలిన వెదవల్లారా.. రేయ్ వాన్ని తన్ను.. రేయ్ రారా చూపిస్తా.. మా ఆఫీసుకే వస్తార్రా మీరు.. ఎంత ధైర్యం రా నీకు.. ధైర్యం ఉంటే రాండ్రా గాడిదల్లారా.. బోడి నా కొడుకులు తమాషాలాడుతున్నారా.. రౌడీలకే రౌడినిరా నేను.. తరిమి తరిమి కొట్టిస్తా.. గుడ్డలిప్పదీసి కొట్టిస్తా… పోలీసులు చొక్కాలిప్పేసి నిద్రపోండి.. ఎందుకు మీకు పోలీసు ఉద్యోగం.. మీతో కాకపోతే నేనే తేల్చుకుంటా.. దద్దమ్మ సీఎం.. పనికి మాలిన సీఎం.. రౌడీ సీఎం.. ఇదేమన్నా పులివెందుల అనుకుంటున్నావా..” అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. చంద్రబాబు నోటి వెంట ఇటువంటి భాష రావడం చాలా మందిని విస్మయానికి గురి చేసింది. చంద్రబాబు మాట్లాడిన భాషపై వైసీపీ శ్రేణులు తప్పుబడుతున్నారు. రాజకీయాల్లో ఇటువంటి భాష ఉపయోగించడం ఎవరు చేసినా తప్పేనని చెప్పాల్సింది పోయి సహనం కోల్పోయినట్లు చంద్రబాబు వ్యవహరించారని అంటున్నారు.


Share

Related posts

Medi chettu: ఈ చెట్టు చుట్టూ 11 ప్రదక్షణలు చేస్తే అదృష్టం కలిసి వస్తుంది.!

bharani jella

PRC: కర్ర విరగలేదు – పాము చావలేదు..! గురువారం మరో సారి చర్చలు..!!

somaraju sharma

Lemon Grass: లెమన్ గ్రాస్ టీ సర్వరోగ నివారిణి..!! ఈ టీ తాగితే ఫలితాలు రెట్టింపు..!!

bharani jella