NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Bonda Uma: వంగవీటి రాధాపై మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా కీలక వ్యాఖ్యలు..

Bonda Uma: ఏపిలో జిల్లాల పునర్విభజన కాక కొనసాగుతూనే ఉంది. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జిల్లాల విభజన, డివిజన్ల ఏర్పాటు జరగలేదని పలు ప్రాంతాల నుండి నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇటీవల హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అక్కడి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అఖిలపక్ష నేతలతో కలిసి ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు జిల్లాల్లో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాలపై అధికార పార్టీ నేతలకు ప్రజల నుండి వత్తిడి వస్తున్నా అక్కడి వైసీపీ ఎమ్మెల్యేలు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. తాజాగా కృష్ణాజిల్లాలోనూ నేతల పేర్ల అంశంపై డిమాండ్లు వస్తున్నాయి. ఇప్పటికే విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మచిలీపట్నం (తూర్పు కృష్ణా)కు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టి, విజయవాడ జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ వస్తుంది.

TDP Ex MLA Bonda Uma Key comments on vangaveeti Radha
TDP Ex MLA Bonda Uma Key comments on vangaveeti Radha

Bonda Uma: విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలి

ఈ డిమాండ్ తో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు రేపు విజయవాడ ధర్నా చౌక్ లో దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో ప్రభుత్వం ఎవరి అభిప్రాయాలను తీసుకోలేదని, సొంత పార్టీ వ్యవహారంలా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. అందుక అనేక జిల్లాల్లో స్థానిక సంఘాలు, ప్రజలు అభ్యంతరాలు తెలుపుతున్నారని అన్నారు. ప్రజల మనోభావాలను సీఎం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. గుడివాడ కేసినో వ్యవహారం చూసి రాష్ట్ర ప్రజలు ఉలిక్కిపడ్డారనీ, దీని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకే తెరపైకి కొత్త జిల్లాల ఏర్పాటు తీసుకువచ్చారన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే జిల్లాలకు పేర్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలని, తూర్పు కృష్ణా కు ఎన్టీఆర్ పేరు పెట్టాలని బొండా ఉమా డిమాండ్ చేశారు

రాధాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు

ఇదే క్రమంలో వంగవీటి రాధాపైనా బోండా ఉమా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు విషయంపై రాధా ఎటువంటి ప్రయత్నం చేస్తున్నారో తనకు తెలియదన్నారు. మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలతో రాధాకు మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. డిసెంబర్ 26న వాళ్లంతా కలిసి కార్యక్రమాల్లో పాల్గొన్నారనీ, నాని, వంశీలు ఉద్యమం చేయాల్సిన పని లేదనీ, వాళ్ల నాయకుడికి ఒక్క మాట చెబితే చాలన్నారు. రాధా ఆ వైపుగా ప్రయత్నం చేస్తున్నారేమో తను చెప్పలేనన్నారు తాను రేపు చేపట్టే దీక్షకు కులాలు, పార్టీలకు అతీతంగా అందరూ తరలిరావాలని బొండా ఉమా కోరారు. రంగా అభిమానులు అందరూ దీక్షలో పాల్గొనాలని బొండా ఉమా పిలుపునిచ్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju