ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఆ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..

Share

YSRCP: గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జియాఉద్దీన్ మంగళవారం వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ జియాఉద్దీన్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

TDP ex mla sm ziauddin joins YSRCP
TDP ex mla sm ziauddin joins YSRCP

జియాఉద్దీన్ గుంటూరు -1 మాజీ ఎమ్మెల్యే. రెండు పర్యాయాలు ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ కమిషన్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహించారు. జియాఉద్దీన్ చేరిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముస్తఫా, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాగా జియా ఉద్దీన్ నిన్ననే టీడీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా టీడీపీపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


Share

Related posts

Anupama Parameswaran Looking Gorgeous

Gallery Desk

పవన్ అభిమానులకు షాకిచ్చిన దిల్ రాజు..?

Teja

ఏపి సర్కార్ కు హైకోర్టులో మరో షాక్.. ఆ స్కీమ్ ను కొనసాగించాల్సిందేనంటూ హైకోర్టు ఆదేశాలు

somaraju sharma