TDP Janasena Seats Sharing: ఏపి రాష్ట్ర రాజకీయాల్లో జనసేన – టీడీపీ పొత్తు పొడువడం ఖాయం గానే కనబడుతోంది. ఈ పార్టీల పొత్తుకు సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటకు వస్తుంది. పొత్తులకు సంబంధించి ఆయా పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు సందర్భం వచ్చిన ప్రతి సారి స్పందిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వారి వ్యూహాల్లో నిమగ్నమైయ్యాయి. రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రీసెంట్ గా ఓ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సంవత్సరంలో రావచ్చు లేదా రెండేళ్లలో జరగవచ్చు అని సజ్జల అన్నారు. అంటే ముందస్తు ఎన్నికలకు వైసీపీ సిద్దం అన్న సంకేతం ఇచ్చేనట్లు అవుతోంది. 2023 సెప్టెంబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వైసీపీ వెళ్లబోతుంది అన్నట్లుగా ‘న్యూస్ ఆర్బిట్” గతంలోనే కథనం ఇవ్వడం జరిగింది. అందుకే రాజకీయ పార్టీలు పొత్తులు, వ్యూహాలకు సన్నద్దం అవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడపదడపా పొత్తులపై స్పందిస్తున్నారు. ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా స్పందిస్తున్నారు.

- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
TDP Janasena Seats Sharing: సీట్ల పంపకాలపై రకరకాల చర్చలు
టీడీపీ – జనసేన పొత్తు అంశం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుండి (సుమారు నాలుగు నెలలు) సీట్ల పంపకాలపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టీడీపీ వాళ్లు ఒక రకంగా, జనసేన వాళ్లు మరో తరహాగా కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జనసేన మాత్రం 60 – 70 సీట్లు అన్నట్లుగా పేర్కొంటున్నాయి. అదే మాదిరిగా జనసేన అనుకూల మీడియాలో జనసేన 60 – 70 సీట్లు గెలుస్తుంది అని రకరకాల సర్వే వార్తలను ఇస్తున్నాయి. ఇటు టీడీపీయేమో జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే ఓడిపోతామేమో, కాస్త లిమిట్ లో సీట్లు ఇవ్వాలి అన్న అంచనాలో ఉంది. వాళ్లు గెలిచే సీట్లే ఇవ్వాలి అన్న ఆలోచనలో టీడీపీ ఉంది. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తే వారు ఓడిపోవడం వల్ల వైసీపీ లాభం చేకూర్చినట్లు అవుతుంది భావిస్తుంది. అదే విధంగా బీజేపీకి సీట్లు ఇస్తే అంతర్గతంగా వైసీపీతో కుమ్మక్కు అయి వైసీపీకి లాభం చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది అన్న భయంలో టీడీపీ ఉంది. ఎక్కువ సీట్లు ఇవ్వడానికి టీడీపీలో కొందరు సీనియర్ నేతలు అంగీకరించడం లేదు.
డిజిటల్ మీడియాలో రకరకాల పుకార్లు
పొత్తుల అంశం ఫైనల్ అయిన తరువాత సీట్ల పంపకాల విషయంలో నాలుగైదు విడతల చర్చలు జరగాల్సి ఉంటుంది. పొత్తుల అంశమే ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం ప్రాధమిక స్థాయిలోనే ఉంది. ఇప్పటి వరకూ ముడు నాలుగు అడుగులు మాత్రమే పడ్డాయి. ఇంకా పది పదిహేను అడుగులు పాడాల్సి ఉంటుంది. ఇదంతా అయిన తరువాత సీట్ల పంపకాలు. సీట్లు ఎన్ని ఇవ్వాలి అన్నది ఫైనల్ అయి తరువాత ఏయే సీట్లు కేటాయించే అంశంపైనా పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇదంతా జరగక ముందే డిజిటల్ మీడియాలో ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంపై వాళ్ల వాళ్ల అంచనాలు వెల్లడిస్తుంటాయి. పార్టీలో అంతర్గత చర్చలు ఇప్పటి వరకూ జరగలేదు. కానీ ఇప్పటికే ఓ ఛానల్ లో జనసేనకు 40 నుండి 45 అసెంబ్లీ, అయిదు పార్లమెంట్ సీట్లు అంటూ వార్త ఇచ్చేశారు. మరో ఛానల్ లో 60 సీట్లు అని చెప్పారు. టీడీపీ అనుకూల ఛానల్ లో కేవలం 25 సీట్లు అని ఇచ్చారు. సీట్లకు సంబంధించి ఇప్పటి వరకూ ఆయా పార్టీల మధ్య ఎటువంటి చర్చ జరగలేదు. చర్చలు ప్రారంభం కాకముందే ఇన్ని అన్ని సీట్లు అని ఊహించుకుని వార్తలు ఇవ్వడం అనవసరం. ప్రస్తుతం డిజిటల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మాల్సిన అవసరం లేదు.