NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ నేత, బీటెక్ రవికి బిగ్ షాక్ .. ఎమ్మెల్సీ పదవీ కాలం ముగియడంతో ..

Share

టీడీపీ పులివెందుల ఇన్ చార్జి బీటెక్ రవికి ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఆయనకు ఉన్న గన్ మెన్ లను ప్రభుత్వం తొలగించింది. ఆయన వద్ద ఉన్న ఇద్దరు గన్ మెన్ లను వెనక్కి రావాల్సిందిగా వైఎస్ఆర్ జిల్లా పోలీసు అధికారులు ఆదేశించారు. ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం గత నెల 29వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయన సెక్యూరిటీని వెనక్కి తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు. తన గన్ మెన్ లను తొలగించినట్లు రవి దృవీకరించారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని, అవసరమైతే న్యాయపరంగా పోరాడుతానని ఆయన వెల్లడించారు.

TDP Leader Btech Ravi

 

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు ఎవరో అందరికీ తెలుసు.. సీబీఐ పెద్ద చేపలను వదిలేసి చిన్న చేపలను పట్టుకుంది, ఇంకా విచారించాల్సిన వారు, శిక్షించాల్సిన వారు ఉన్నారు అంటూ బీటెక్ రవి కామెంట్స్ చేసిన 24 గంటల వ్యవధిలోనే ప్రభుత్వం ఆయన సెక్యూరిటీ తొలగింపునకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.  2006 లో బీటెక్ రవి బాబాయి రామచంద్రా రెడ్డిని ప్రత్యర్ధులు హత్య చేశారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బీటెక్ రవికి ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్ లతో రక్షణ కల్పించారు. అప్పటి నుండి రవికి గన్ మెన్ లు ఉన్నారు.

టీడీపీ హయాంలో టు ప్లస్ టు గన్ మెన్ లు ఉండేవారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆరు నెలలకు ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్ లకు రక్షణ కుదించారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై గత కొంత కాలంగా బీటెక్ రవి తన వాదనలను బలంగా వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రవికి గన్ మెన్ లను తొలగించడం చర్చనీయాంశమైంది. బీటెక్ రవికి భద్రత తొలగింపుపై చంద్రబాబు స్పందించారు. ఈ అంశంపై డీజీపీకి లేఖ రాశారు చంద్రబాబు. సెక్యూరిటీని పునరుద్దరించాలని చంద్రబాబు కోరారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిందన్న కారణంతో సెక్యూరిటీని తొలగించడం సరికాదని పేర్కొన్నారు.

ఏపి సర్కార్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు .. రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్


Share

Related posts

బ్రేకింగ్: ప్రెస్ మీట్ పెట్టనున్న కెసిఆర్..! వాటి గురించే ప్రస్తావన?

arun kanna

North Korea: ఉత్తర కొరియాలో కరోనాతో పాటు కొత్త వ్యాధి..!!

sekhar

చలికాలం పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. లేదంటే?

Teja