ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Budda Venkanna: టీడీపీలో వంద మంది సూసైడ్ బ్యాచ్.. బుద్దా వెంకన్న సంచలన కామెంట్స్

Share

Budda Venkanna: టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. తమ పార్టీ నేత చంద్రబాబుపై కొంత మంది చెత్త వాగుడు వాగుతున్నారు. వారికి ఇదే హెచ్చరిక అంటూ బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేశామనీ, అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా..చావడానికైనా సిద్ధమని అన్నారు.

TDP leader Budda Venkanna Sensational comments on ycp
TDP leader Budda Venkanna Sensational comments on ycp

Budda Venkanna: నోరు అదుపులో పెట్టుకోవాలి

బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలో చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పేదలకు చీరలు పంపిణీ చేశారు. చంద్రబాబు భారీ కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ వైసీపీ నేతలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదనీ, ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. చంద్రబాబును తిడితే, టీడీపీ కార్యాలయంపై దాడి చేస్తే పదవులు వస్తాయనుకుంటున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.

సీనియర్ లను కాదని జోగి రమేష్ కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లినందుకే అని వాళ్ల పార్టీ నేతనే చెప్పారని అన్నారు. ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు చవిచూడాల్సి వస్తుందని బుద్దా వెంకన్న హెచ్చరించారు. బుద్దా వెంకన్న చేసిన ఈ  సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో..!?

ఆత్మాహుతి దళాలు టెర్రరిస్ట్ గ్రూపుల్లో, మావోయిస్టు గ్రూపుల్లోనే ఉంటాయి. అటువంటిది ఇప్పుడు టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆత్మాహుతి దళం తయారు చేశామని బాహాటంగా కామెంట్స్ చేయడం విమర్శలకు తావు ఇస్తోంది. పలువురు టీడీపీ నేతలు కూడా ఈ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారని సమాచారం.

 

 


Share

Related posts

మామ వర్సెస్ కోడలు ! మధ్యలో జగన్ !!

Yandamuri

పిల్లి వైఖరి వైస్సార్సీపీకు సంకటం? : తూర్పుగోదావరి రాజకీయాలు మారబోతున్నాయా ?

Special Bureau

CM KCR: మాజీ మంత్రి మోత్కుపల్లికి కేసిఆర్ సర్కార్ లో కీలక పదవి..? ఇదీ సాక్షం..!!

somaraju sharma