టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్ ను న్యాయమూర్తి ఆదేశాలతో గన్నవరం సబ్ జైలుకు తరలించారు పోలీసులు. పట్టాభితో సహా మరో 13 మందిపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. నిన్న న్యాయమూర్తి ముందు హజరుపర్చిన సంగతి తెలిసిందే. మెజిస్ట్రేట్ నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించగా, రిమాండ్ రిపోర్టును వ్యతిరేకిస్తూ పట్టాభి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇదే సమయంలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ, చేతులు, కాళ్లపై కొట్టారని పట్టాభి న్యాయమూర్తికి వివరించారు.

ఈ నేపథ్యంలో విజయవాడ జీజీహెచ్ లో పరీక్షలు నిర్వహించి మళ్లీ ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు పట్టాభిని విజయవాడ జీజీహెచ్ కు తరలించి పోలీసులు పరీక్షలు చేయించారు. బుధవారం పట్టాభిని గన్నవరం కోర్టులో పోలీసులు హజరుపర్చారు. పట్టాబి మెడికల్ రిపోర్టును విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సీల్డ్ కవర్ లో న్యాయమూర్తికి అందించారు. పట్టాబి శరీరంపై తీవ్ర గాయాలు ఏమి లేవనీ, కేవలం చేతిపై వాపు మాత్రమే ఉందని నివేదికలో వైద్యులు పేర్కొన్నట్లు తెలిసింది.
ఈ నివేదిక అధారంగా పట్టాబికి రిమాండ్ విధిస్తూ గన్నవరం సబ్ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం పోలీసులు పట్టాభిని పోలీసులు గన్నవరం సబ్ జైలుకు తరలించారు. అయితే గన్నవరం సబ్ జైల్ కు వద్దని, శాంతి భద్రతల సమస్య వస్తుందని జైలర్ న్యాయమూర్తికి విన్నవించారు. ముందే ఈ విషయం కోర్టుకు తెలపాలి కదా అని జడ్జి ప్రశ్నించారు. తర్వాత ఆదేశాలు వస్తే పట్టాభితో సహా ఇతర నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించే అవకాశాలు ఉన్నాయి.
క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ సంచలన కామెంట్స్ .. వారి నుండి తనకు ప్రాణ హాని ఉందంటూ..