Junior NTR: భువనేశ్వరికి వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ టీడీపీ నేత వర్ల రామయ్య 12 గంటల దీక్ష..జూనియర్ ఎన్టీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు..

Share

Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో వర్ల రామయ్య దంపతులు 12 గంటల దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన జూనియర్ ఎన్టీఆర్ ‌తో పాటు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేసిన వీడియో సంతృప్తికరంగా లేదు. తన మేనత్త శీలాన్ని శంకిస్తూ కొందరు దుండగులు చేసిన వ్యాఖ్యలకు ఆయన రియాక్షన్ సరిపోదు. ఒక మేనల్లుడుగా ఏమి చేయాలి.. రియాక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి. కర్రో, కత్తో తీసుకువచ్చినట్లుగా ఉండాలి. ఆయన తండ్రి హరికృష్ణ బ్రతికి ఉంటే ఆయన ఒక సీతయ్యగా మారేవాడు. ఎవరి మాట వినేవాడు కాదు, వీళ్లకు చూపించేవాడు తమాషా,  వీళ్లందరికీ తరిమి తరిమి బుద్ది చెప్పేవాడు. ఆయన కుమారుడు గా, భువనేశ్వరికి మేనల్లుగా జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్ ఆశించినంతగా లేదు” అని వర్ల రామయ్య తన వ్యక్తిగత అభిప్రాయంగా పేర్కొన్నారు.

tdp leader varla Ramaiah serious comments on Junior NTR
tdp leader varla Ramaiah serious comments on Junior NTR

“సినిమాలు అందరికీ అందరికీ ఉంటాయి, బాలయ్య బాబుకు సినిమాలు లేవా, ఆయన ఏమన్నా వెనుకడు వేశారా. తన సోదరికి జరిగిన అవమానాన్ని, తన బావుగారు విలపించిన తీరుకు ఘాటుగా స్పందించారు” అని అన్నారు. సినిమాల కోసం కుటుంబాన్ని నైతిక విలువలను వదులుకుంటారా అని వర్ల రామయ్య నిలదీశారు. అసెంబ్లీలో జరిగిన ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అందరూ స్పందించారని అన్నారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం, స్వీకర్ వారి పేరు పెట్టి వారిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయన్నారు. అసెంబ్లీ ఆ రికార్డింగ్ లను తొలగించి ఉంటారనీ, తాము అనలేదని ఇప్పుడు బుకాయిస్తున్నారని అన్నారు. చర్చకు వస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. వారు కించపిరిచేలా మాట్లాడారని నిరూపిస్తే క్షమాపణ చేబుతారా అని వర్ల రామయ్య ప్రశ్నించారు. నాడు కౌరవ సభలో దృష్టరాష్ట్రుడు గుడ్డివాడుగా ఉండగా, నేడు అసెంబ్లీలో సభాపతి ఆ తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా పలువురు టీడీపీ నేతలు వర్ల రామయ్య చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు.


Share

Related posts

Island: తిండి లేకుండా 33 రోజులు ఐలాండ్ లో ఎలా బ్రతికారో తెలుసా?

Naina

విషాదానికి, వైరస్ కి మొదటి పుట్టిన రోజు..! మానవ మేధస్సు ఓటమి రోజు..!!

Vissu

Anchor SREE Mukhi : ఒకే ఒక్క ఫోటో షూట్ తో అనసూయ , రశ్మి ని డామినేట్ చేసి అవతల పడేసిన శ్రీముఖి

bharani jella