Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు లీగల్ ములాఖత్ లకు అధికారులు కోత విధించారు. రోజుకు రెండు లీగల్ ములాఖత్ లను ఒకటికి కుదించారు. చంద్రబాబుకు ములాఖత్ ల వల్ల సాధారణ ఖైదీలకు జైల్ లో ఇబ్బందులు ఎదరువుతున్నాయన్న కారణంతో ఇకపై రెండో ములాఖత్ రద్దు చేసినట్లు జైలు అధికారులు లిఖిత పూర్వకంగా తెలిపారు.
రాజమండ్రి జైల్ లో అయిదు వారాలుగా లేని భద్రతా ఇబ్బంది ఇప్పుడే ఎందుకు వచ్చిందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుపై కేసుల మీద కేసులు పెడుతూ లీగల్ ములాఖత్ లను కూడా కుదించడం కుట్రే అని టీడీపీ వ్యాఖ్యానిస్తొంది. చంద్రబాబు పై నమోదైన కేసులకు ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నందున న్యాయవాదులతో సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. లీగల్ ములాఖత్ పై ఆంక్షలు విధించడంపై టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇవేళ టీడీపీ నేతలు జైళ్ల శాఖ డీఐడీ రవికిరణ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ములాఖత్ లు తగ్గించడంపై డీఐజీ రవికిరణ్ తో నేతలు చర్చించారు. ఇలాంటి సమయంలో లీగల్ ములాఖత్ లను ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. రోజుకు రెండు సార్లు లీగల్ ములాఖత్ లు ఇవ్వాలని వారు కోరారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మలకాయల చిన రాజప్ప తదితర టీడీపీ నేతలు డీఐజీ రవికిరణ్ కలిసి వినతి పత్రం సమర్పించగా, టీడీపీ నేతలు లేవనెత్తిన అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Chandrababu Arrest: స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు