Gannavaram (Krishna): విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కృష్ణాజిల్లా గన్నవరం సబ్ స్టేషన్ వద్ద బుధవారం టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పిలుపు మేరకు గన్నవరం సబ్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసి విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు ఇబ్బడి ముబ్బడిగా పెరగడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.