NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Mahanadu 2022: టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపిన మహానాడు

TDP Mahanadu 2022: ఒంగోలులో రెండు రోజుల పాటు జరిగిన మహానాడు విజయవంతం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. పార్టీ అంచనాలకు మించి పెద్ద సంఖ్యలో తరలివచ్చినట్లు వార్తలు రావడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, వర్ల రామయ్య, తదితర సీనియర్ నాయకుల ప్రసంగాలు పార్టీ కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. గత ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తరువాత టీడీపీ మహానాడు నిర్వహించలేదు. ఆ తరువాత రెండేళ్లు కరోనా కారణంగా మహానాడు బహిరంగంగా నిర్వహించలేదు. ఆన్ లైన్ లోనే నిర్వహించుకున్నారు.

TDP Mahanadu 2022 leaders full happy
TDP Mahanadu 2022 leaders full happy

TDP Mahanadu 2022: అంచనాలకు మించి..

మూడేళ్ల తరువాత బహిరంగంగా జరిగిన ఈ మహానాడుకు అధికార పక్షం నుండి తొలుత అనేక ఇబ్బందులు ఎదురైనా నిన్న ప్రతినిధుల సభకు, నేడు బహిరంగ సభకు అంచనాలకు అధిగమించి రావడం వారిలో సంతోషాన్ని నింపింది. నిన్న ప్రతినిధుల సభలో పలు తీర్మానాలను నేతలను ప్రతిపాదించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పలువురు మాజీ మంత్రులపై కేసులు నమోదు చేయడం, అరెస్టు చేయడం, కార్యకర్తలపై వివిధ రకాల కేసులు నమోదు చేయడం జరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీ శ్రేణుల్లో కొంత నైరాశ్యం అలుముకుంది. దాంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయాలు నమోదు చేసుకుంది. ఆ తరువాత మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి నేపథ్యంలో చంద్రబాబు రెండు రోజుల పాటు దీక్ష చేయగా పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక మొదలైంది.

 

అనంతరం టీడీపీ వరుస కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పార్టీ కార్యకర్తలు చురుగ్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ తరుణంలో ఒంగోలు మహానాడు తలపెట్టగా వేదిక ఏర్పాటునకే తొలుత ఇబ్బందులు ఎదురయ్యాయి. పార్టీ శ్రేణుల కోసం ఆర్టీసీ బస్సుల ఏర్పాటునకు ప్రయత్నించినా కుదరనివ్వలేదు.

 

ఇదే క్రమంలో ఇటు మహానాడు జరుగుతున్న సమయంలో వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ప్రారంభించారు. మీడియా ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైసీపీ ఈ ఎత్తుగడ వేసిందని టీడీపీ విమర్శించింది. ఇదిలా ఉంటే మహానాడుకు ఎంత మంది హజరయ్యారు అనే దానిపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వైసీపీ అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తొంది. ఈ మహానాడులో పార్టీ అధికార ప్రతినిది కావలి గ్రీష్మ ప్రసాద్ ఆవేశంగా ప్రసంగిస్తూ వైసీపీ సర్కార్ కు తొడగొట్టి సవాల్ విసరడం హైలెట్ గా నిలిచింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju