Subscribe for notification

బాలయ్యకు నానిపై తీవ్ర కోపం వచ్చింది..! ఎమన్నాడంటే..?

Share

 

ఏపి పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శలు, వ్యాఖ్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ పైనా నాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతుంటారు. ఇటీవల తన నియోజకవర్గంలో పేకాట రాయుళ్లు అరెస్టు అయిన నేపథ్యంలో తన దైన స్టైల్ లోనే నాని సమాధానం చెప్పారు. పేకాట ఆడితే జరిమానా కట్టడమే కదా, అందుకే జరిమానాలు కట్టేసి మళ్లీ వచ్చి ఆడుకుంటారని నాని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా రామతీర్థం ఘటనపై టీడీపీ ఆందోళన చేయడాన్ని పురస్కరించుకుని చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మామకు వెన్నుపోటు, చిత్తకార్తె కుక్కలు, కులం, మతం లేదు అంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ అంటూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక బూతుల మంత్రి, ఆయన అంతే అంటూ టీడీపీ శ్రేణులు ఒకటి రెండు సార్లు అనేసి ఆయన వ్యాఖ్యలపై అంతగా రియాక్ట్ కావడం లేదు.

అయితే నాని వ్యాఖ్యలపై టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తీవ్రంగా స్పందించారు. న్యాయం, చట్టం అంటే ఏ మాత్రం గౌరవం లేకుండా ఆ మంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొడితే తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయన్నారు.  నాని పేరు ప్రస్తావించకుండానే.. నోరు అదుపులో పెట్టుకోవాలి,  మాటలు మాట్లాడమే కాదు అవసరమైతే చేతలు కూడా చూపిస్తాం అంటూ బాలకృష్ణ హెచ్చరించారు. తమ సహనాన్ని పరీక్షించవద్దని బాలకృష్ణ సూచించారు.  బాలకృష్ణ ఈ రోజు తన నియోజకవర్గం హిందూపురం గ్రామాల్లో పర్యటించి  పంటలను పరిశీలించారు.  రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై కొడాలి నాని ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీకోదండ రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై ఒక పక్కటీడీపీ, మరో పక్క బీజెపి- జనసేన, హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. ఈ ఘటన తెలుగుదేశం పార్టీ కుట్రేనంటూ అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

 


Share
somaraju sharma

Recent Posts

Sudigali Sudheer : సుధీర్‌పై నాగబాబు సెటైర్లు.. మళ్లీ ఒకే చోట చేరిన గ్యాంగ్..

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…

2 mins ago

Rashmika: కెరీర్‌లో పెద్ద టర్నింగ్‌ పాయింట్ ఆ సినిమానే అంటున్న ర‌ష్మిక‌!

Rashmika: నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఛ‌లో`తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి అన‌తి…

32 mins ago

Pears: తప్పనిసరిగా తినాల్సిన పండు ఇది..!

Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…

33 mins ago

Breaking: ఎంపీ రఘురామకు హైకోర్టులో ఊరట.. లంచ్‌మోషన్ పిటిషన్‌పై కీలక ఆదేశాలు

Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…

1 hour ago

Non Veg: వర్షాకాలం ఆకుకూరలతో పాటు మాంసాహారం తినకూడదా.!? ఎందుకని.!?

Non Veg: వర్షాకాలం (Monsoon)  మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…

1 hour ago

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా క్షిపణి దాడిలో 18 మంది మృతి.. 30 మందికి గాయాలు

Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…

2 hours ago