Chintamaneni Prabhakar: టీడీపీ రెబల్ నేత చింతమనేని ప్రభాకర్ ఏపీ పోలీసుల తీరుపై మండిపడ్డారు. మంగళవారం తన పుట్టినరోజు నేపథ్యంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రక్తదాన శిబిరాలు ఏర్పాట్లకు పరిశీలించడానికి వెళ్లడం జరిగింది. ఆ సమయంలో తనపై పోలీసులు ప్రదర్శించారని చింతమనేని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి..వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

పోలీసులు తన చొక్కా చించేసారని విమర్శించారు. రక్తదాన శిబిర ఏర్పాట్లు పర్యవేక్షించడానికి ప్రభుత్వాసుపత్రి దగ్గరికి వెళ్తే తనని పోలీసులు అడ్డుకున్నారని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా తన చిరిగిపోయిన చొక్కాను మీడియా ప్రతినిధులకు చూపించడం జరిగింది. ఏం తప్పు చేశానని నా చొక్కా చించేశారు..? అని చింతమనేని ప్రశ్నించారు. ఇక డీఎస్పీ సత్యనారాయణ తన పట్ల దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలనుకోవడం తప్పా అని అన్నారు. అదే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో హరి రామ జోగయ్య ఉన్నారన్న కారణంతో తనని పోలీసులు అడ్డుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి అందుకే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విమర్శల వర్షం కురిపించారు.

ఇప్పటికే తనపై 31 కేసులు పెట్టడం జరిగింది. అయినా గాని న్యాయం కోసం పోరాడుతూనే ఉంటా. అత్యుత్సాహం ప్రదర్శించే పోలీసులకు కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చింతమనేని హెచ్చరించారు. ఇదంతా తాడేపల్లి ప్యాలెస్ డైరెక్షన్ లో జరుగుతుందని అన్నారు. నాపై అక్రమంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ నేతలకు శాంపిల్ గా భయమేంటో చూపించావు. నాపై పెట్టిన అక్రమ కేసులలో నేరం రుజువు చేయగలవా అంటూ సీఎం వైఎస్ జగన్ ని ఉద్దేశించి చింతమనేని సీరియస్ కామెంట్లు చేశారు. జరిగిన ఈ దుర్ఘటన మొత్తం డీజీపి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.