TDP : చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు షాక్..! పొలిట్ బ్యూరో సమావేశానికి డుమ్మా..! ఎందుకంటే..?

Share

TDP : సీనియర్ టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో కీలకమైన పొలిట్ బ్యూరో సమావేశానికి ఆయన గైర్హజరు అయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలు, పరిషత్ ఎన్నికలపై పొలిట్ బ్యూరో లో చర్చించాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. పార్టీలో కొందరు ఇప్పటికే ఎంపిటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలను బహిష్కరించడమే మేలు అన్నట్లు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ అధినేత నిర్ణయాన్ని అశోక్ గజపతి రాజు విభేదిస్తున్నట్లు తెలుస్తోంది.

TDP senior leader ashok gajapathi Raju absent party meeting
TDP senior leader ashok gajapathi Raju absent party meeting

పార్టీలో ప్రతి కార్యక్రమానికి విధిగా హజరయ్యే అశోక్ గజపతిరాజు ఈ సమావేశానికి గైర్హజరు అవ్వడం పట్ల పార్టీ నేతల్లో చర్చనీయాంశమయ్యింది. పార్టీ ఎన్నికలను బహిష్కరిస్తే నష్టపోతామని అశోక్ గజపతిరాజు భావనగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు జిల్లాలో స్థానికంగా ఉన్న సమస్యలపైనా ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కారణాల వల్ల పొలిట్ బ్యూరో సమావేశానికి అశోక్ గజపతిరాజు డుమ్మా కొట్టారని అనుకుంటున్నారు. గత నెలలో జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ వ్యూహాలకు టీడీపీ పూర్తిగా చతికల పడింది. పంచాయతీ ఎన్నికల్లో 20 నుండి 30 శాతం టీడీపీ మద్దతు దారులు గెలిచారని చెప్పుకున్నా మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క మున్సిపాలిటీతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ పరిస్థితుల్లో పరిషత్ ఎన్నికలకు ముందుకు పోయినా పెద్దగా ఫలితం ఉండదని ఎక్కువ మంది నాయకుల అభిప్రాయంగా ఉంది. ప్రస్తుతం అధికార వైసీపీ ఎదురు నిలిచి పోరాడటం కష్టమే అని కొందరు అంటున్నారు. అయితే పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంలో సీనియర్ నేతలకు చంద్రబాబు సర్ధిచెప్పడం కొంత ఇబ్బందికర పరిస్థితేనంటున్నారు. ఏది ఎలా ఉన్న ఈ సాయంత్రానికి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంటున్నారు.


Share

Related posts

ఆది నుంచి అనూహ్యం వరకు… అన్న రాజకీయ ప్రస్థానం!!

Comrade CHE

ఆ ప్రచారంలో నిజం లేదు – ఉత్తమ్

sarath

Bigg boss Lasya : కామెడీ స్టార్స్ సెట్ లో బిగ్ బాస్ లాస్య సందడి? యాంకర్ రవితో బేబమ్మలా నటించిన లాస్య?

Varun G