NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ సీనియర్ నేత యనమలకు ఇంటిపోరు..తునిలో హాట్ టాపిక్ గా మారిన యనమల కృష్ణుడు ఫోన్ కాల్ ఆడియో

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఇంటిపోరు బహిర్గతం అయ్యింది. రాజకీయాల్లో పదవుల విషయానికి వస్తే తండ్రి, కొడుకులు, అన్నతమ్ముల మధ్య కూడా విభేదాలు రావడం చూస్తూనే ఉన్నాము. తాజాగా ఇప్పుడు తుని నియోజకవర్గ టీడీపీ లో యనమల సోదరుల మధ్య పంచాయతీ రచ్చకెక్కినట్లుగా కనబడుతోంది. యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు మాట్లాడినట్లుగా ఒక ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం హాట్ టాపిక్ అయ్యింది. 2014, 2019 ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యనమల కృష్ణుడు రెండు సార్లు వరుసగా పరాజయం పాలైయ్యారు. అయినప్పటికీ నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జిగా యనమల కృష్ణుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చే ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించేందుకు సిద్దం అవుతున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో తుని అసెంబ్లీ టికెట్ ను తన కుమార్తె దివ్యకు ఇప్పించనున్నట్లుగా యనమల రామకృష్ణుడు సంకేతాలు ఇచ్చారు. దీంతో యనమల రామకృష్ణుడు పై సోదరుడు యనమల కృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Yanamala Brothers

 

తుని నియోజకవర్గ పరిధిలోని తొండంగి టీడీపీ నేతతో యనమల కృష్ణుడు మాట్లాడినట్లుగా ఉన్న ఓ సెల్ ఫోన్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కృష్ణుడు లేకపోతే తుని నియోజకవర్గంలో టీడీపీయే ఉండదనీ, యనమల కృష్ణుడు కష్టపడుతుంటే సీటు యమనల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు టికెట్ ఇవ్వడం ఏమిటంటూ ఊరికి 40 మంది చొప్పున వెళ్లి యనమల రామకృష్ణుడిని నిలదీయాలని, ప్రశ్నించాలని కృష్ణుడు ఆ టీడీపీ నేతతో మాట్లాడినట్లుగా ఆడియో లో ఉంది. ఈ ఆడియో లీక్ వ్యవహరం తుని నియోజకవర్గంలో చర్చనీయాంశం అవుతోంది.

 

యనమల రామకృష్ణుడు టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలో ఉన్నారు. 19983 ఎన్నికల నుండి వరుసగా 2004 ఎన్నికల వరకూ తుని నియోజకవర్గం నుండి గెలుస్తూ వచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు కేబినెట్ లో వివిధ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 ఎన్నికల్లో మొదటి సారి ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత ఆయన పోటీ నుండి తప్పుకుని తమ్ముడు యనమల కృష్ణుడుకు 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అయితే రెండు పర్యాయాలు కృష్ణుడు ఓటమి పాలైయ్యారు. అయితే ఇప్పుడు సీటు విషయం అన్నతమ్ముల సవాల్ గా మారడం టీడీపీకి పెద్ద తలనొప్పిగా మారుతోందని అంటున్నారు. ఈ ఆడియో వైరల్ పై ఇంత వరకూ యనమల సోదరులు స్పందించలేదు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!