తెలుగుదేశం పార్టీకి హ్యాకర్ లు షాక్ ఇచ్చారు. టీడీపీకి చెందిన అధికారిక ట్విట్టర్ ఖాతా (జైటీడీపీ) హ్యాకింగ్ కు గురైంది. ప్రస్తుతం దాదాపు అన్ని రాజకీయ పక్షాలు సోషల్ మీడియాపై ఎక్కువ ఆధారపడిన విషయం తెలిసిందే. వారి పార్టీ కార్యక్రమాలను ప్రమోట్ చేసుకోవడంతో పాడు ఎదుటి పక్షాలపై విమర్శలు చేస్తూ వీడియోలు, కంటెంట్ పోస్టు చేస్తుంటారు. రాజకీయ పక్షాల సోషల్ మీడియా అకౌంట్ లకు లక్షలాదిగా ఫాలోవర్ లు ఉంటుంటారు. గత కొంత కాలంగా జాతీయ స్థాయి నేతల ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్ లు హాకింగ్ గురైన సంగతి తెలిసిందే.
తాజాగా టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ గురైన విషయాన్ని టీడీపీ డిజిటల్ వింగ్ (ఐటీడీపీ అఫీసీయల్) శనివారం మద్యాహ్నం పేర్కొంది. వైసీపీ మద్దతుతో కొందరు వ్యక్తులు తమ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని తెలిపింది. అంతే కాకుండా ఈ కుట్రను ఛేదించి అతి త్వరలోనే టీడీపీ ఖాతాను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.ఇటీవలే ఒక పర్యాయం టీడీపీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో గంటల వ్యవధిలోనే తిరిగి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. తాజాగా మరో సారి ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం జరిగింది.
టీడీపీ ట్విట్టర్ అకౌంట్ కు టైప్ చేస్తే టైలర్ హ్యాబ్స్ అనే అకౌంట్ జై టీడీపీ హ్యాండిల్ తో ప్రత్యక్షం అవుతోంది. ఈ ఖాతాలో టీడీపీ పోస్టులకు బదులుగా విజువల్ ఆర్ట్స్ కు చెందిన పోస్టులు కనబడుతున్నాయి.
Chandrababu: టీడీపీలో గాలి కబుర్లు.. బాబుని కలిసి.. సీటు అంటూ సొంత బాకాలు..!?
Telugu Desam Party's official account @JaiTDP has been hacked by nefarious elements supported by the ruling YSRCP. We will be back shortly !
— iTDP Official (@iTDP_Official) October 1, 2022