NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP: బ్రేకింగ్…రాత్రికి రాత్రే టీడీపీలో నుండి వాళ్లద్దరిని సస్పెండ్ చేయబోతున్నారు..??

TDP: రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కాయకల్ప చికిత్స మొదలు పెట్టారు. గత ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీలో అనూహ్య మార్పులకు తెరలేపారు చంద్రబాబు నాయుడు. పార్టీలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు గానూ చంద్రబాబు ఏడాది క్రితమే కొత్త ప్రయోగం చేపట్టారు. అంతకు ముందు లేని విధంగా జిల్లా పార్టీ అధ్యక్షుల విధానంను తొలగించి పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులను నియాకమం చేశారు చంద్రబాబు. పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉంటాయి కాబట్టి పార్టీ బలోపేతానికి నేతలు కృషి చేసే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావించారు. ఆ క్రమంలో భాగంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు 25 మంది నేతలను అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. అయితే తొలి నాళ్లలో అధికార వైసీపీకి భయపడి కొందరు నేతలు యాక్టివ్ గా పని చేయలేదు. ఆ తరువాత పార్టీ దిశానిర్దేశంతో చాలా మంది తమ పరిధిలో పార్టీ బలోపేతానికి యాక్టివ్ గా పని చేస్తూ వస్తున్నారు.

TDP unhappy from those two leaders?
TDP unhappy from those two leaders

Read More: Vanama Raghava: వనమా రాఘవ కేసులో: ‘దిమ్మతిరిగే ట్విస్ట్’  ఏపి తెలంగాణ ప్రజలతో పాటు పోలీసులూ దెబ్బతిన్నారు..!

TDP: పార్టీ పరిస్థితులపై రివ్యూలు

గత కొద్ది రోజులుగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై రివ్యూలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలోనే పార్లమెంట్ అధ్యక్షుల పని తీరుపైనా వాకబు చేస్తున్నారు. చాల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో అధ్యక్షులు బాగానే పని చేస్తున్నారని ఫీడ్ బ్యాక్ వచ్చిందట. తమతమ స్థానాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారుట. కొందరు మాత్రం అంత యాక్టివ్ గా పని చేయడం లేదని సమాచారం. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు పులివర్తి నాని, నరసింహ యాదవ్ లు అంత చురుగ్గా పని చేయడం లేదని పార్టీకి ఫీడ్ బ్యాక్ వచ్చినట్లు చెబుతున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు చురుగ్గా పని చేస్తేనే వారి పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వైసీపీ చాలా యాక్టివ్ గా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ముందుగా వీరితో మాట్లాడి పని తీరు మెరుగుపర్చుకోవాలనీ సూచించనున్నారనీ, అప్పటికీ వారిలో మార్పు కనబడకపోతే ఆ ఇద్దరు నేతలను పక్కను పెట్టి యాక్టివ్ గా పని చేసే నేతలకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju