Breaking: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం నార్ల తాతారావు పవర్ స్టేషన్ (ఎన్టీపీసీ) లో సాంకేతిక లోపం తలెత్తిందని సమాచారం. పవర్ స్టేషన్ లో రెండో యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మొత్తం 1760 మెగావాట్ల గాను వెయ్యి మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని సమాచారం.
మరో పక్క బొగ్గు కొరత కారణంగా మిగతా ఆరు యూనిట్ లలో లోక్ తగ్గించారని తెలుస్తొంది. రెండో యూనిట్ లో సాంకేతిక లోపాన్ని సరిచేసే పనిలో అధికారులు ఉన్నట్లు తెలుస్తొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ప్లాంట్ లకు బొగ్గు కొరత కారణం విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో పరిశ్రమలకు రెండు నుండి నాలుగు గంటల విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లుగా తెలుస్తొంది. ఇప్పుడు ఎన్టీపీసీ ఇబ్రహీంపట్నంలో విద్యుత్ ఉత్పత్తి పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో విద్యుత్ మరింత ఎక్కువగా అంతరాయాలు ఏర్పడతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Aditya L -1 Mission: అంత వేడిగా ఉండే సూర్యుడి మీదకి ఆదిత్య L1 వెళితే, కాలి బూడిదై పోదా ??