NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్

Telangana: తెలంగాణ‌లో గుడ్ న్యూస్‌… డెల్టా టెన్ష‌న్ లేదంట‌…

Telangana: రాబోయే రోజుల్లో కోవిడ్‌ థర్డ్ వేవ్‌ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తేయ‌డంతో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ కొందరు దీన్ని తేలికగా తీసుకుంటూ.. నిర్లక్ష్యంగా ఉంటున్నారు. భౌతిక దూరం మాట దెవుడెరుగు.. కనీసం మాస్కులు కూడా పెట్టుకోవడం లేదు. ఏమయ్యా అంటే..మేము వ్యాక్సిన్ తీసుకున్నం.. మాకు ఏమీ కాదులే అంటూ నిర్లక్ష్యంగా చెబుతున్నరు. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోతే మళ్లీ కరోనా కేసులు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని మరోపక్క నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఎలాగైతే స్వీయ జాగ్రత్తలు పాటించామో అలాగే ఉండాలని చెబుతున్నారు. ఈ స‌మ‌యంలోనే తెలంగాణ‌లో కీల‌క ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.

 

Read More: KCR: కేసీఆర్ కంట్లో పడిన సీనియ‌ర్‌.. ఇక అన్నీ మంచిరోజులే..

తెలంగాణ‌లో ఆ స‌మ‌స్య లేద‌ట‌
తెలంగాణలో ఇప్పటి వరకు డెల్టా ప్లస్ వెలుగు చూడలేదని, యూకే, యూఎస్ లో డెల్టా వెరీయాంట్ కేసులు వెలుగు చూస్తున్నాయని డైరెక్ట‌ర్ ఆఫ్ హెల్త్‌ శ్రీనివాస్ రావు చెప్పారు. తెలంగాణలో జులై 1 నుంచి విద్యా సంస్థలను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కాలేజీలు, స్కూళ్లలో పని చేసే టీచర్లు, సిబ్బందికి వాక్సినేషన్ చేపట్టినట్లు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్) శ్రీనివాస రావు చెప్పారు. విద్యాసంస్థల్లో పనిచేసే వారు తమ ఐడీ కార్డులను వ్యాక్సినేషన్ కేంద్రాల్లో చూపించి వ్యాక్సిన్ పొందాలని సూచించారు.

Read More: corona: గుడ్ న్యూస్ఃపిల్ల‌ల‌కు క‌రోనా ముప్పు తక్కువ‌ట‌

ఈ జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం…
లాక్ డౌన్ ఎత్తివేయ‌డంతో ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణం చేసే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కూర్చొనే సీట్లు, మోచేతులు పెట్టుకోవడానికి వీలుగా ఉన్న ఆర్మ్‌రెస్ట్స్‌, మెట్లు ఎక్కేటప్పుడు చేతులతో పట్టుకునే.. హ్యాండ్రాయిల్స్‌ తదితర వాటితో వైరస్ వచ్చే అవకావం ఉంటుంది. ఒకరికంటే ఎక్కువ మంది వాడే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాటిన తాకిన వెంటనే శానిటైజ్ చేసుకోవాలి. బయటికి వచ్చినప్పుడు చేతులను పరిశుభ్రం చేసుకోకుండా కండ్లు, ముక్కు, నోరును నేరుగా ముట్టుకోకూడదు. దీంతో పాటుగా ఇంట్లోనూ జాగ్ర‌త్త‌గా వ‌హించాలి.

author avatar
sridhar

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju