AP greenko project: ఏపిలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు పరిధిలోని పిన్నాపురం వద్ద గ్రీన్‌కో సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టు పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు తెలంగాణ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) మురళీధర్ మంగళవారం కేఆర్ఎంబీ చైర్మన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో మురళీధర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపి ప్రభుత్వం పంప్డ్ హైడ్రో ప్రాజెక్టును చేపడుతోందని ఆయన ఆరోపించారు. అనుమతులు లేని ఈ ప్రాజెక్టులను నిలువరించాలని ఆయన కోరారు. ఏపిలోని పంప్డ్ హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు వివరాలు తమకు ఇవ్వాలని కోరారు. కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్ కో ప్రాజెక్టు కోసం కృష్ణా జలాలను వినియోగించరాదని ఆయన తెలిపారు. కృష్ణా నుండి ఇతర బేసిన్లకు జలాల తరలింపుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జల విద్యుత్ కోసం కృష్ణా జలాల వినియోగంపైనా మురళీధర్ అభ్యంతరం చెప్పారు.
అపెక్స్ కౌన్సిల్, బోర్డు అనుమతులు లేని ప్రాజెక్టులను ఆపాలని మురళీధర్ ఈ లేఖలో కేఆర్ఎంబీ చైర్మన్ ను కోరారు. ఇంతకు ముందు కూడా ఏపి ప్రాజెక్టులపై తెలంగాణ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ బోర్డుకు ఫిర్యాదు చేసింది. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏపి సర్కార్ చేపడితే దీనిపైనా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై ఏపి సర్కార్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…