సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. సోమేశ్ కుమార్ చేసుకున్న పదవీ విరమణ (వీఆర్ఎస్) దరఖాస్తునకు సీఎం జగన్ ఆమోద ముద్ర వేశారు. తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సోమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకుని గత నెల 12వ తేదీన ఏపి కేడర్ లో రిపార్టు చేసిన సంగతి తెలిసిందే. ఏపీ జీఏడీకి రిపోర్టు చేసిన ఆయనకు సర్కార్ ఎలాంటి పోస్టు కేటాయించలేదు. అయితే ఆ తర్వాత ఆయన చేసుకున్న వీఆర్ఎస్ ధరఖాస్తునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్వచ్చంద పదవీ విరమణ కు ఏపి ప్రభుత్వం ఆమోదిస్తే.. సోమేష్ కుమార్ కు గుడ్ న్యూస్ ఏమిటి..? అని అనుకుంటున్నారా..! నిజంగా ఆయనకు ఇది గుడ్ న్యూస్ యే. ఎందుకంటే ..

సోమేష్ కుమార్ సేవలను తెలంగాణ సీఎం కేసిఆర్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలోనే గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ .. సోమేష్ కుమార్ ను రిలీవ్ చేసింది. ఏపి సర్కార్ ఆయన స్వచ్చంద పదవీ విరమణకు అంగీకరించిన వెంటనే తెలంగాణ ప్రభుత్వంలో మరో కీలక పదవిలో నియమించేందుకు సీఎం కేసిఆర్ సిద్దంగా ఉన్నారుట. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు చేపట్టేందుకు సోమేష్ కుమార్ కు మార్గం సుగమం అయినట్లు అయ్యింది. ఇదే ఆయనకు గుడ్ న్యూస్. సోమేష్ కుమార్ విఆర్ఎస్ ధరఖాస్తును ఎక్కువ రోజులు పెండింగ్ లో పెట్టకుండా ఏపి సర్కార్ ఆమోదం తెలిపింది. రేపో..మాపో తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీఎంఓలకు రీ ఎంట్రీ కానున్నారు సోమేశ్ కుమార్.
బీహార్ కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్ కు కేంద్రం కేటాయించినా .. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపిలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసే సమయం కూడా ఇవ్వకుండా కేంద్రం అదే రోజు సోమేష్ కుమార్ ఏపిలో జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
దీంతో ఆయన గత నెల 12వ తేదీన ఏపి జీఏడీలో రిపోర్టు చేశారు. అదే రోజు ఏపి సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వంలో ఏ పోస్టు ఇచ్చినా కొనసాగడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఏపిలో రిపోర్టు చేయడానికి వచ్చిన రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏ శాఖలో పోస్టు ఇచ్చినా నిర్వహించడానికి సిద్దంగా ఉన్నాననీ తెలిపారు. వీఆర్ఎస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనీ, కుటుంబ సభ్యులతో చర్చించిన అనంతరం తెలియజేస్తానన్నారు. కొద్ది రోజులకే ఆయన విఆర్ఎస్ ధరఖాస్తు చేసుకోవడం, దాన్ని ప్రభుత్వం ఆమోదించడం జరిగిపోయాయి.
బీజేపీకి బైబై చెప్పేందుకు సిద్దమైన కన్నా ..! నేడు అనుచరులతో కీలక భేటీ .. ఏ పార్టీలో చేరనున్నారంటే..?