NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YS Viveka Case: తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి స్వల్ప ఊరట .. బుధవారం వరకూ ఆరెస్టు చేయవద్దు

YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ నిన్న, ఇవేళ విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తుది ఉత్తర్వులు ఈ నెల 31వ తేదీ (బుధవారం) ఇస్తామని పేర్కొన్న న్యాయస్థానం.. అప్పటి వరకూ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీబీఐకి సూచించింది. అవినాష్ రెడ్డి, సునీత రెడ్డి తరపు న్యాయవాదులు నిన్న వాదనలు వినిపించగా, ఇవేళ సీబీఐ తరపున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిల్ వాదనలు వినిపించారు.

ys Viveka Murder Case Telangana High court

 

అవినాష్ కు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అవినాష్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు సహకరించడం లేదని, ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా అవినాష్ రెడ్డి పట్టించుకోవడం లేదని కోర్టుకు తెలిపింది. కేసు దర్యాప్తులో అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారని సీబీఐ వెల్లడించింది. దర్యాప్తు తమ పద్దతి ప్రకారం చేస్తాము కానీ అవినాష్ రెడ్డి కోరుకున్నట్లు కాదని సీబీఐ తరపు న్యాయవాది అనిల్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంలో హైకోర్టు సీబీఐకి పలు ప్రశ్నలు సంధించింది.

హత్యకు అనేక ఉద్దేశాలు చెబుతున్నారు..? అవినాష్ రెడ్డి రాజకీయంగా అంత ప్రభావిత వ్యక్తి అయితే.. వివేకా ను చంపాల్సిన అవసరమేమిటి..? 2017 ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా..! హత్య వరకూ వెళ్తారా..? భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి అరెస్టుకు కారణాలు ఏమిటి..? కస్టడీ విచారణలో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి ల నుండి ఏమి తెలుసుకున్నారు..? వివేకా మృతదేహం చూడగానే గాయాలు కనిపించాయా..? రక్తపు మరకలు తుడచడం ఎవిడెన్స్ టెంపర్ ఎలా అవుతుంది..? మృతదేహం చూస్తే మర్డర్ గా తెలుస్తుంది..? రక్తపు మరకలతో అవసరం లేదు కదా..! గాయాలు చూస్తే హత్య అని ఎవరైనా చెబుతారు కదా..! గదిలో రక్తం తుడిచేస్తే సాక్ష్యాలకు నష్టం ఏమిటి..? అంటూ ఇలా సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. వీటిపై సీబీఐ సమాధానం ఇచ్చింది.

వివేకా హత్య కు నెల రోజుల ముందే కుట్ర జరిగిందనీ, వివేకా హత్య రాజకీయ కోణాలతోనే జరిగిందని స్పష్టం చేసింది. అవినాష్ కుటుంబానికి వివేకాతో రాజకీయ విభేదాలు ఉన్నాయనీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి వెనుక కుట్ర జరిగిందని తెలిపింది. కడప ఎంపీ టికెట్ విజయలక్ష్మి లేదా షర్మిలకు ఇవ్వాలని వివేకా అడిగారు. వివేకాపై రాజకీయంగా పై చేయి సాధించాలని అవినాష్ రెడ్డి భావించారు.  కుట్ర లో ప్రమేయం దృష్ట్యా భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను అరెస్టు చేశాం, భాస్కర్ రెడ్డి, ఉదయ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదు. హత్య కు గంగిరెడ్డి ద్వారా అవినాష్ రెడ్డి కుట్ర చేశారు. శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి ద్వారా హత్య కుట్ర అమలు చేశారు.

వివేకాపై కోపం ఉన్న వారిని గంగిరెడ్డి కుట్రలోకి లాగారు. శత్రువుకు శత్రువు మిత్రుడనే విధానం ఇక్కడ అమలు చేశారు. అవినాష్ రెడ్డి నుండే డబ్బులు వచ్చాయని దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చారు. అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి ఇస్తే.. తను గంగిరెడ్డికి ఇచ్చారు. రూ.4కోట్ల ఖర్చు పెట్టడానికి శివశంకర్ రెడ్డికి ఏం అవసరం ఉంది. రూ.75 లక్షల్లో రూ.46 లక్షలు మున్నా లాకర్ నుండి స్వాధీనం చేసుకున్నాం. వివేకా గదిలో రక్తం కడిగేసి సాక్ష్యాలను చెరిపేశారు అంటూ ఇలా సీబీఐ తరపున సమాధానాలు చెప్పారు. సీబీఐ వాదనలు ముగిసిన తర్వాత న్యాయమూర్తి తుది ఉత్తర్వులు బుధవారం వెల్లడిస్తామని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

IT Rides: రియల్ ఎస్టేట్ సంస్థలపై కొనసాగుతున్న ఐటీ దాడులు ..భారీగా నగదు, డాక్యుమెంట్లు స్వాధీనం

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N