మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై ఇవేళ తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిసాయి. హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. కోర్టు అదేశాల మేరకు అవినాష్ రెడ్డి విచారణకు సంబంధించి వీడియో గ్రఫీ, ఆడియో గ్రఫీ, కేసు వివరాలను సీల్డ్ కవర్ లో సీబీఐ సమర్పించింది. మొత్తం 35 సాక్షుల స్టేట్ మెంట్లు, పది డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు కోర్టుకు సమర్పించింది. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన లేఖ, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టును కూడా సీబీఐ హైకోర్టుకు అందజేసింది. 160 సీఆర్‌పీసీ లో విచారించబడుతున్నారనీ, కోర్టు ద్వరా విచారణకు రాలేదని, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నోటీసులతో వచ్చారని సీబీఐ తెలిపింది. దీంతో వీడియో గ్రఫీ అవసరం లేదని హైకోర్టు తెలిపింది.

అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సునీత పిటిషన్ వెనుక సీబీఐ హస్తం ఉందని తెలిపారు. సునీత అభియోగాల వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. వివేకా హత్య అనంతరం అనుకూలంగా ఉన్న సునీత ఏడాది తర్వాత ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి, వివేకా రెండో భార్య షమీంల పాత్రపైనా సీబీఐ విచారణ చేయడం లేదని కోర్టుకు తెలిపారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని దర్యాప్తు జరగాలని కోరారు. ఇరువురి వాదనలు పూర్తి అవ్వగా హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
తీర్పు వెలువడే వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐని అదేశించింది. అయితే పార్లమెంట్ సెషన్ జరుగుతున్న కారణంగా అవినాష్ ను సీబీఐ విచారణ జరపకుండా చూడాలని న్యాయవాది కోర్టుకు తెలియజేస్తూ తమ అభ్యర్ధనను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. “మీరే పిటిషన్ వేస్తారు.. మీరే పార్లమెంట్ ఉందని చెప్తారు.. ఆర్డర్ రేపే ఇవ్వచ్చేమో..” అంటూ హైకోర్టు తెలిపింది. రేపు విచారణకు పిలవకూడదు అనుకుంటే సీబీఐ అనుమతి తీసుకోవాలని. తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
Breaking: సీబీఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు మృతి