NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Telangana High Court: బిగ్ బ్రేకింగ్ – తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్..! జాతీయ రహదారిపై అంబులెన్స్‌లను నిలువరించవద్దు..!!

Telangana High Court: తెలంగణ రాష్ట్ర సరిహద్దుల్లో ఏపి అంబులెన్స్‌ల నిలిపివేతపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రానికి వచ్చే అంబులెన్స్ లను ఆపే హక్కు ఎవరిచ్చారంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ అంబులెన్స్ లు ఆపొద్దని పోలీసు శాఖను హైకోర్టు ఆదేశించింది. ఏపి నుండి తెలంగాణకు వైద్య సహాయం కోసం అంబులెన్స్ లో వస్తున్న పేషంట్స్ ను సరిహద్దులో నిలిపివేస్తున్నారంటూ రిటైర్డ్ ఐఆర్ఎస్ వెంకట కృష్ణారావు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది.

Telangana High Court stays govt order on ambulance no entry
Telangana High Court stays govt order on ambulance no entry

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టగా పిటిషనర్ తరపున న్యాయవాది అంబులెన్స్ ను నిలువరించడం చట్టవిరుద్దమని ప్రకటించాలని కోరారు. రాష్ట్రంలోకి అంబులెన్స్ లను అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషన్ లో ఏపి ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యింది. ఏపి ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.

దీనిపై ప్రభుత్వం తరపున ఏజీ వాదనలు వినిపించారు. ఏపి, చత్తీస్‌గడ్, కర్నాటక, మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల నుండి కరోనా బాధితులు హైదరాబాద్ కు వస్తున్నారనీ, దీంతో హైదరాబాద్ లో పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆసుపత్రుల్లో పడకలు రిజర్వు చేసుకున్న రోగులను అనుమతి ఇస్తున్నామనీ, ఈ విషయాన్ని ముందే చెప్పామన్నారు. ఢిల్లీ లాంటి రాష్ట్రాలు కూడా ఆంక్షలు విధించాయని కోర్టుకు ఏజి తెలిపారు.

దీనిపై స్పందించిన హైకోర్టు ఏజి వాదనలను తప్పుబట్టింది. అంబులెన్స్ లను ఏ రాష్ట్రం అపలేదని తెలిపింది. అంబులెన్స్ ను నిలువరించడం రాజ్యాంగం, చట్టాలు, హైకోర్టు ఆదేశాల ఉల్లంఘన కాదా అని ప్రశ్నించింది. జాతీయ రహదారులపై రాకపోకలను నియంత్రించే అధికారం రాష్ట్రానికి ఎక్కడిదని ప్రశ్నించింది. ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇస్తూ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రెండ వారాల్లోగా కౌంటర్ లు దాఖలు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!