NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

Telugu Cine industry: చిరంజీవి ఇంట్లో అత్యవసర భేటీ..! జగన్ నిర్ణయంపై సినీ పెద్దలు సీరియస్..!!

Telugu Cine industry: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంస్కరణల పేరిట తీసుకుంటున్న పలు నిర్ణయాలు కొన్ని పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. కొన్ని ఇండస్ట్రీలను పాతాళంలోకి తొక్కేస్తున్నాయి. అన్నింటిపైనా ప్రభుత్వ పెత్తనం ఉండాలి, అన్ని రంగాలపై తన పెత్తనమో ఉండాలి, తమ వాళ్ల పెత్తనమే ఉండాలి అనుకోవడం మూర్కత్వం. అందరూ నా మాట వినాలి, లేదా అందరూ నా సలహాలు పాటించాలి, అందరూ తమకు అనుకూలంగా ఉండాలి, తమ పార్టీకి ఓట్లు వేయాలనుకోవడం రాజకీయం. రాజకీయం చేయవచ్చు కానీ ముర్కత్వం చేయకూడదు. కానీ నేడు వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మూర్కత్వపు దిశగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పెద్దల కన్ను సినీ పరిశ్రమపై పడింది. నిన్న ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలుసు. అది ఆ పరిశ్రమ రంగాన్ని లొంగదీసుకోవడానికి అని  భావిస్తున్నారు. దాని మీద సినీ పెద్దలు ఏలా స్పందిస్తున్నారు? ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సాయంత్రం జరగనున్న మీటింగ్ ఏమని చర్చించనున్నారు? అసలు సినీ పరిశ్రమ వాయస్ ఏమిటి రాబోతున్నది అనేది ఆసక్తికరంగా మారుతోంది.

Telugu Cine big shots angry on ys jagan
Telugu Cine big shots angry on ys jagan

సినిమా హాలులో టికెట్ లను ప్రభుత్వమే అన్ లైన్ లో వెబ్ సైట్ నిర్వహించి అమ్ముతుంది. ఇలా అమ్మిన డబ్బును ప్రతి నెలా 30వ తేదీన ఆ ధియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు పంపిస్తుంది. ఎవరికి ఎలా పంపాలో అలా పంపిస్తుంది ఇది అంత వరకూ బాగానే ఉంటుంది. అయితే ఇది ఒక రకంగా ధియేటర్లను కంట్రోల్ లో పెట్టడానికి, సినీ పరిశ్రమలో నల్లధనాన్ని కంట్రోల్ చేయడానికి లేదా సినిమా టికెట్లలో బ్లాక్ టికెట్ల విక్రయాన్ని, బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టింది అన్న రికార్డులను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ వేరే వర్షన్ సినీ పరిశ్రమ నుండి వినబడుతోంది. సినిమా తీసే డబ్బులేమో నిర్మాతవి. సినిమా కొనుక్కునేది డిస్ట్రిబ్యూటర్ లు, సినిమాని రిలీజ్ చేసేది  డిస్ట్రిబ్యూటర్ల వద్ద షోకు ఇంత అని కొనుక్కుని వేసుకునేది ధియేటర్లు. టికెట్లు కొనుగోలు చేసేది ప్రజలు. అయితే ఈ నలుగురితో ఏ మాత్రం సంబంధం లేని ప్రభుత్వం మధ్యలో దూరడంలో ఉద్దేశం ఏమిటి ?. ప్రభుత్వానికి ఏమైనా సినిమా ఖర్చులతో గానీ నిర్మాణంలో గానీ సంబంధం ఉందా? అంటే అదీ లేదు. ధియేటర్లకు గానీ, నిర్మాతలకు గానీ ఏమైనా రాయితీలు ఇస్తుందా? అంటే అదీ లేదు.

ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు అంటే ఫరవాలేదు. దానిపై కొంత వరకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి నిర్ణయం కిందే భావించాలి. సినిమా రంగానికి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లతో ఏమాత్రం సంబంధంలేని ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా విక్రయించి నెల వరకూ వారి వద్ద ఉంచుకుని తరువాత ఇవ్వడం అంటే ఆ డబ్బును అప్పుగా తీసుకున్నట్లేగా భావించాలి. ప్రతి నెలా డబ్బులు ప్రభుత్వం సక్రమంగా ఇస్తుందన్న గ్యారెంటీ కూడా ఉండదు. ఈ నెల డబ్బులు మరుసటి నెలా తరువాత నెలా ప్రభుత్వం ఇచ్చినా ఆ రంగం వాళ్లు గట్టిగా ప్రభుత్వాన్ని అడగలేని పరిస్థితి ఉంటుంది. దీంతో సినీ పరిశ్రమ దెబ్బతినే అవకాశం ఉంటుందనే వాదన వినబడుతోంది.

ఈ విషయాలపై చర్చించేందుకు సినీ పెద్దలు అందరూ చిరంజీవి నివాసంలో నేటి సాయంత్రం భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా రాజకీయ పెద్దలకు సినిమా పరిశ్రమలోని హీరోలు భజన చేస్తూనే ఉంటున్నారు. అనవసరంగా, అకారణంగా భజన ట్వీట్లు చేస్తుంటారు. ఇటు సీఎం జగన్మోహనరెడ్డికి, అటు సీఎం కేసిఆర్ కు అభినందనలు, శుభాకాంక్షలు అంటూ చిరంజీవి, మహేష్ బాబు తదితర పెద్ద పెద్ద హీరోలు ట్వీట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిరంజీవి, సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు ? తమ వాయస్ గట్టిగా సీఎం జగన్ కు వినిపిస్తారా ? లేక కోర్టులో పిటిషన్ వేసి తేల్చుకుంటారా ? అనేది వేచి చూడాలి.

Read More: Visakhapatnam Land Scam YCP MLA: విశాఖలో భూ బాగోతం..! ఆయన పాత్ర ఏమిటో..?

author avatar
Srinivas Manem

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju